రేంజ్ పెరిగింది… బాబు పెంచకపోతే ఎలా..!

Hero Nani Next 3 Projects Remuneration News Buzzటాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో ఎవరు అంటే ‘నాచురల్ స్టార్’ నాని అన్న పేరు మాత్రమే వినిపిస్తుంది. ఇప్పటికే ‘డబుల్ హ్యాట్రిక్’ను కొట్టిన ఈ హీరో, ఈ ఏడాది మరో రెండు, మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు నడుమ ఉన్న నాని రేంజ్ పెరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ ఏడాది విడుదలైన ‘నేను లోకల్’ తెచ్చిన కమర్షియల్ సక్సెస్ అని చెప్తున్నారు.

రొటీన్ సినిమాగా విడుదలైన ‘నేను లోకల్’ నానిలోని కమర్షియల్ యాంగిల్ ను ఎలివేట్ చేసిందని, దీంతో అప్పటివరకు తీసుకున్న పారితోషికాన్ని దాదాపుగా రెట్టింపు చేసాడని సినీ జనాల టాక్. రెమ్యూనరేషన్ పెంచినా, దాంతో సంబంధం లేకుండా ఫుల్ డిమాండ్ ఉన్న నటులలో నాని ఒకడిగా చేరిపోయాడు. అయినా అగ్ర హీరోలకే సాధ్యం కాని విధంగా ‘డబుల్ హ్యాట్రిక్’ను కొట్టిన నాని, తన రేంజ్ ను పెంచడంలో తప్పులేదులే అని సినీ జనాలే చెప్పుకుంటున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories