కేసీఆర్ సర్కార్ కు అక్కినేని హీరో సలహా!

Hero-Sumanth-tweets-on-traffic-rules!అక్కినేని కాంపౌండ్ నుండి వచ్చిన సుమంత్, ఆశించిన స్థాయికి ఎదగకపోయినప్పటికీ, ‘సత్యం, గోదావరి’ వంటి చిత్రాల ద్వారా క్లాస్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే విజయాల శాతం చాలా తక్కువ కావడంతో ప్రజల్లో బలమైన ముద్ర వేయలేకపోయారు. ప్రస్తుతం “మళ్ళీ రావా” సినిమాతో బిజీగా ఉన్న సుమంత్, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ఆగష్టు 3వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ADVERTISEMENT

సుమంత్ సినిమా సంగతులు ఇలా ఉంటే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. తనకు నచ్చిన స్పోర్ట్స్, సినిమా, రాజకీయం… అంశం ఏదైనా గానీ దానిపై స్పందిస్తూ సందడి చేసే సుమంత్, తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసులకు ఓ సూచన చేసారు. ఓపెన్ టాప్ లో ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తున్న కారు ఫోటోను షేర్ చేసిన సుమంత్, ఒక్కసారి సడెన్ బ్రేక్ వేస్తే వారి పరిస్థితి ఏంటని… దీనిపై చట్టం తీసుకురావాలని సూచన చేసారు.

ఇలాంటి తాను చాలా రెగ్యులర్ గా చూస్తున్నానని చెప్పిన సుమంత్, ఏదైనా జరిగితే ఊహించుకోవడం కష్టమని స్పష్టం చేసాడు. ఇటీవల కాలంలో కేటీఆర్ పుణ్యమా అంటూ తెలంగాణా సర్కార్ సోషల్ మీడియాలో బాగా స్పందిస్తుండడంతో, అదే వేదికగా తన అభిలాషను హైదరాబాద్ సిటీ పోలీసులకు సూచించారు. ట్రాఫిక్ పై కఠిన నియమ నిబంధనలను అమలు చేస్తోన్న హైదరాబాద్ పోలీసులు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories