అనుమానాస్పదంగా తనీష్ తండ్రి మరణం?

Hero tanish father death mysteryటాలీవుడ్ నటుడు తనీష్ తండ్రి వర్ధన్ మరణం ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి వుండవచ్చని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నారు. మణికొండలోని వెస్ట్రన్ ప్లాజాను పరిశీలించిన పోలీసు వర్గాలు, పొరపాటున కిందకు పడే అవకాశాలు లేవని భావిస్తున్నట్టు తెలిపారు. వర్ధన్ కు అప్పులున్నాయని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఓ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.

అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించామని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ఇటీవల వర్ధన్ కొన్ని ఆస్తులను విక్రయించారని కూడా సమాచారం. గత రాత్రి వెస్ట్రన్ ప్లాజాలో ఆరో అంతస్తు నుంచి వర్ధన్ కింద పడి తీవ్రగాయాలతో మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఫ్లోర్ రెయిలింగ్ మూడు అడుగుల కన్నా ఎత్తుగా ఉండటంతో, ప్రమాదం జరిగే అవకాశాలు తక్కువని పోలీసులు భావిస్తున్నారు. కాగా, తమ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవని వర్ధన్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories