బడ్జెట్ లో ‘వాయింపుడు’ బ్యాచ్ చాలా ఉంది!

Highlights of budget 2016“మీ ఇంటికొస్తే ఏమీస్తారు… మా ఇంటికొస్తే ఏం తెస్తారు..?” అన్న నానుడిని అమలు చేసే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రజలకు ఎలాంటి సంక్షేమ పధకాలు అమలు చేసినా, లేకున్నా, ప్రజల నుండి మాత్రం పన్నుల రూపంలో, ధరల పెంపు రూపంలో రెవిన్యూను రాబట్టేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేసింది. రోజురోజుకు చిద్రమవుతున్న పేదవాడి బ్రతుకుకు కాస్త ఆసరాగా ఉంటుందని ఉండాల్సింది పోయి, అంతకంతకూ అణగద్రొక్కి, తన ఖజానాను నింపుకునే ప్రయత్నం వైపుకే కేంద్రం మొగ్గు చూపుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT

ముఖ్యంగా బడ్జెట్ లో ధరల పెంపు జాబితాతో పోలిస్తే, ధరలు తగ్గించిన జాబితా అసలు పరిగణనలోనికి తీసుకునేది కాదని చెప్పవచ్చు. ఒక్కసారి వాటి వివరాలను పరిశీలిస్తే…

ధరల పెంపు జాబితా :

కార్లు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, పేపర్ తో చుట్టిన బీడీలు, గుట్కాలు, బిల్లు చెల్లింపులు.
రెస్టారెంట్లలో పసందైన రుచులు, విమాన ప్రయాణాలు, వెయ్యి రూపాయలు పైబడిన బ్రాండెడ్, ఇతర వస్త్ర ఉత్పత్తులు.
బంగారం, వెండి, ఆభరణాలు, దిగుమతి చేసుకున్న ఇమిటేషన్ జ్యూయెలరీ, అల్యూమినియం ఫాయిల్, ప్టాస్టిక్ బ్యాగులు, బుట్టల ధరలు, మినరల్ వాటర్.
రోప్ వే, కేబుల్ కార్లలో ప్రయాణాలు, పారిశ్రామిక సోలార్ వాటర్ హీటర్లు, లాటరీ టికెట్లు, స్టేజీ క్యారియర్ సర్వీసులు, ప్యాకర్స్, మూవర్స్ సర్వీసులు, ఈ రీడింగ్ పరికరాలు, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ పరికరాలు, దిగుమతి చేసుకున్న గోల్ఫ్ కార్స్, బంగారు కడ్డీలు.

ధరల తగ్గింపు జాబితా :

పాదరక్షలు, సోలాల్ దీపాలు, బ్రాడ్ బ్యాండ్ మోడెమ్స్, రూటర్లు, సెట్ టాప్ బాక్సులు, డిజిటల్ వీడియో రికార్డర్లు, సీసీటీవీ కెమెరాలు, హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వాహనాలు, 60 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియాతో ఉన్న చౌక ధరల గృహాలపై కనికరం, జానపద కళా ప్రదర్శన సంస్థలపై కూడా పన్ను భారం తగ్గింది. పెన్షన్ పథకాలు, రిఫ్రిజిరేటెడ్ కంటెయినర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, శానిటరీ ప్యాడ్లు, బ్రెయిలీ పేపర్ పై కూడా పన్ను తగ్గించారు.

ADVERTISEMENT
Latest Stories