ఖైదీ రీమేక్ కోసం బాలీవుడ్ సూపర్ స్టార్?

Hrithik Roshan eyes on Khaidi Movie Hindi Remakeచాలా కాలం నిరీక్షణ తరువాత తమిళ్ హీరో కార్తీ ఖైదీతో సక్సెస్ అందుకున్నాడు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా సక్సెస్ అయ్యింది ఆ సినిమా. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాలో సాంగ్స్ హీరోయిన్ లేకుండా.. కాస్త కొత్తగా ట్రై చేసిన కార్తీ ఫార్ములా వర్కౌట్ కావడంతో ఈ సినిమాపై బాలీవుడ్ కన్ను కూడా పడింది.

లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించిన ఖైదీ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో ప్రభు నిర్మించారు. ఇక అదే బ్యానర్ ప్రముఖ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిసి హిందీలో సినిమాని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ ను సంప్రదించారని సమాచారం.

ADVERTISEMENT

హ్రితిక్ గత ఏడాది వచ్చిన వార్ తో పెద్ద హిట్ కొట్టాడు. అయితే ఆ తరువాత తన తదుపరి చిత్రాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ చిత్రం అతను చేసే అవకాశం ఉందని అంటున్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది మేలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే ఈ సినిమాకు హిందీలో ఎవరు దర్శకత్వం వహిస్తారో చూడాలి. ఖైదీ ఒరిజినల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ విజయ్ ని మాస్టర్ అనే చిత్రంలో డైరెక్ట్ చేస్తున్నాడు. అతను ఈ సినిమాకు పని చేసే అవకాశం దాదాపుగా లేదని అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories