ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందు వస్తున్నాయి. అందులో మలయాళంలో బడా హీరో అయిన మోహాన్ లాల్ నటించిన “ఒడియన్” ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ తో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ మీద ఉంటే..మరో పక్క యువతకు “హుషారు” కలిగించే కధతో “హుషారు” సైతం ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించనుంది అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు…
[m9ad]
ఇక “అనగనగా ఒక ప్రేమ కధ” అంటూ ఒక సినిమా కూడా ఉంది అని అది ఈరోజే రిలీజ్ అని పెద్దగా ఎవ్వరికీ తెలీదు…ఈ సినిమాకి బయ్యర్స్ కూడా లేరు. ఇక చివరకిగా మన ఆర్జీవీ “భైరవ గీత” కూడా ఈరోజే రిలీజ్. కన్నడంలో కాస్త మిక్స్డ్ రివ్యూస్ రావడంతో తెలుగుపై చాలా ఆశలే పెట్టుకున్నాడు వర్మ. అయితే ఈ సినిమా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పాడగా…ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్ పై పడనుంది అని తెలుస్తుంది. మరో పక్క వర్మ సినిమా గురించి తెలిసిన వాళ్ళు, రిస్క్ చేసి థియేటర్స్ కి వెళ్ళి బలైపోయే అంత సాహసం చెయ్యలేం అంటూ పెదవి విరుస్తూ ఉన్నారు.
ఇక పాటల్లో హీరోయిన చేసిన అందాల ఆరబోత మాత్రం కాస్తో కూస్తో కుర్ర కారుకి కిక్కెక్కించి థియేటర్స్ కి రప్పిస్తుందని అని బయ్యర్స్ అంచనా. మరో పక్క తన దారిలో తాను వీలైనన్ని కలెక్షన్స్ రాబట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు మన చిట్టి (రోబో 2.0). మరి ఈ వీకెండ్ ఇంత హడావిడి హంగామాలో ఎవరెన్ని వసూళ్లు సాధిస్తారో… వచ్చే వారానికి ఎవరు ఉంటారో…ఎవరు సర్దుకుంటారో చూద్దాం.



