బారి “నోట్ల” కట్టల పాము…పుట్టెక్కడో?

HYD Police

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అటు రాజకీయ నేతల వాహనాలు మొదలు ఇటు సామాన్య ప్రజానీకం వరకు పోలీసుల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్న తరుణంలో హైద్రాబాద్ సమీపంలో అప్పా జంక్షన్ వద్ద బారి మొత్తంలో “నోట్ల కట్టల పాము” బయటపడింది.అయితే దాని పుట్టెక్కడో వెతికే పనిలో ఉన్నారు తెలంగాణ పోలీస్ అధికారులు.

ఈ మొత్తం డబ్బు ఆరు కార్లలో తరలిస్తుండగా తెలంగాణ పోలీస్ అధికారులు ఆ వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో పట్టివేతకు గురయ్యాయి.అయితే తనిఖీలో దొరికిన మొత్తం సొమ్ము 6.5 కోట్లుగా అధికారులు గుర్తించారు. పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబందించిన సొమ్ముగా అధికారులు భావిస్తున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఒక్కో కారులో ఒక్కో కోటి రూపాయలు చొప్పున తరలిస్తున్న వాహనదారుల నుంచి పోలీస్ అధికారులు సమాచారం రాబట్టే పనిలో పడ్డారు.

ADVERTISEMENT

అధికారుల అనుమానాలకు సరైన ఆధారాలు దొరికినట్టయ్యి ఆ మొత్తం ఒక్క వ్యక్తికీ సంబందించిన సొత్తుగా రుజువైతే ఒక్కో నియోజకవర్గంలో ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థుల రాజకీయ ఖర్చు సుమారుగా ఆరు కోట్లకు పైమాటే అన్నది సుస్పష్టమవుతుంది.
ఇంత మొత్తంలో ఎన్నికలలో పోటీ చేస్తున్న రాజకీయ నాయకులను ఎదురించి ఒక సామాన్యుడు రాజకీయాలలో రాణించగలడా?అంటే అది సాధ్యమయ్యే పనికాదని తేలిపోయింది.

అధికార పార్టీ కుట్రలో భాగమే ఇదంతా.., తనకు ఆ కార్లకు ఎటువంటి సంబంధం లేదు.., ఆ నోట్ల కట్టలకు తానూ యజమానిని కాదు అంటూ మీడియా ముందుకొచ్చి గంభీర ప్రకటనలు చేస్తారు అనుమానితులుగా భావించిన అభ్యర్థులు. ఇదంతా రాజకీయ చక్రంలో ఒక భాగమే అనుకుంటూ ప్రజలు కూడా ఇటువంటి వార్తల పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దాని ఫలితమే ఏపీలో ఏర్పడిన జగన్ ప్రభుత్వం.

మొత్తం 32 కేసులలో A1 ముద్దాయిగా ఉండి లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న జగన్ ను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన ఏపీ ప్రజలు 6 కోట్ల సొమ్ముతో దొరికిన పొంగులేటిని ఎమ్మెల్యే గా చేయలేరా? అంటున్నారు ప్రజాస్వామ్య వాదులు. అందునా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పొంగులేటికి స్థానం ఉంది. షర్మిల కూడా ఈయన గారి గెలుపుకి తానూ అడ్డుపడడం భావ్యం కాదని భావించి ఏకంగా పోటినుంచే తప్పుకున్నారు. అయితే ఈ పొంగులేటి నోట్ల కట్టల పాము తలెక్కడో, తోకెక్కడో, దాని పుట్టెక్కడో తెలుసుకుంటే పుట్టలో ఉన్న ఒక్క కనుమైనా ఏపీ వైపు ఉంటుందేమో! అంటూ సందేహాలు మొదలయ్యాయి.

ADVERTISEMENT
Latest Stories