
అలుపెరగకుండా కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు మహానగరం హైద్రాబాద్ అతలాకుతలం అవుతుంది. రోడ్లన్నీ చెరువులను తలపించేలా వరద నీటితో నిండిపోతున్నాయి. అలాగే అనేక ప్రాంతాలలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుకొని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
ఇక వాహనదారుల ఇక్కట్లకు అంతే లేదు. భారీ ట్రాఫిక్ జామ్ లతో రోడ్ల మీదే గంటల తరబడి పడిగాపులు కాస్తూ నరకానికి స్పెలింగ్ రాస్తున్నారు హైదరాబాదీ వాసులు. ఇక మరికొన్ని చోట్ల రోడ్ల మీద మూతలు చెరిచిన డ్రైనేజ్ హోల్స్ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి.
హైద్రాబాద్ ప్రజలకు ఈ దుస్థితి ఏర్పడడానికి అక్రమ లేఔట్ ల నిర్మాణాలు, చెరువులు, నాళాల ఆక్రమణలే కారణం అని వాటిని తొలగిస్తే హైద్రాబాద్ వరద రహిత ప్రాంతంగా మరింత మెరుగైన వసతులను ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది అంటూ ముఖ్యంమత్రి రేవంత్ అక్రమ నిర్మాణాలు కూల్చివేత అంటూ ‘హైడ్రా’ను హైద్రాబాద్ కు పరిచయం చేసారు.
కారణం మంచిదైనా, ప్రభుత్వం అనుసరించిన విధానాలతో హైడ్రా అనేక కుటుంబాలను ఆర్థికంగా ముంచేసింది. ఎంతోమంది పేద, మధ్యతరగతి వర్గాల జీవితాలలో హైడ్రా మిగిల్చిన చేదు జ్ఞాపకాలు రేవంత్ సర్కార్ కు శాపాలను తెచ్చిపెట్టాయి.
ఐనా సరే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన, ప్రతిపక్షాల నుండి ఎన్ని విమర్శలు పలకరించినా రేవంత్ మాత్రం తగ్గేదెలా అన్నట్టుగా హైడ్రాను మరింత పటిష్టం చేస్తూ హైడ్రాను ఒక స్వతంత్ర వ్యవస్థగా మార్చారు.
నాడు చెరువులను, నాళాలను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన అనేక భవనాలను కూల్చిన హైడ్రా ఈ కూల్చివేతలే రేపటి రోజున హైద్రాబాద్ ను వరద ముంపు నుండి కాపాడవుతుంది అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ వేశారు.
అయితే ఇప్పుడు బారి వర్షాల దెబ్బకు హైద్రాబాద్ లో ఉన్న తాజా పరిస్థితులను ఒక్కసారి పరిశీలిస్తే హైడ్రా హైద్రాబాద్ కు చేసిన మేలేంటి అనే ప్రశ్న హైడ్రా బాధితుల నుండి వ్యక్తమవుతోంది.
నాటి కి నేటికీ వర్షాల వలన హైద్రాబాద్ పరిస్థితి ఎం మెరుగయ్యింది.? రేవంత్ హైడ్రాతో హైద్రాబాద్ లో తీసుకొచ్చిన సమూల మార్పులేంటి.? అంటూ నాడు హైడ్రా కూల్చివేతలలో కళ్ళముందే సొంత ఇంటిని కోల్పోయిన బాధితులు బోరుమంటున్నారు.
మరి వారి ఆవేదనకు హైడ్రా బదులు చెప్పగలదా.? తెచ్చిన మార్పును ప్రజల కళ్ళ ముందు ఉంచగలదా.? నాటికి నేటికీ మధ్య అంతరాన్ని హైడ్రా, హైద్రాబాద్ కు చూపగలదా.? హైడ్రా రాకముందు వర్షపు నీటితో మునిగిన ప్రాంతాలు నేడు హైడ్రా కూల్చివేతలతో వరద ముంపు నుండి రక్షించబడ్డాయా.?
ఇటువంటి ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా హైడ్రా సరైన జవాబు సాక్ష్యాలతో చూపగలిగితే నాడు హైడ్రాతో విమర్శలు ఎదుర్కున్న రేవంత్ నేడు అదే హైడ్రా చర్యలతో ప్రశంసింపబడతారు. లేకుంటే హైడ్రా బాధితుల శాపాల భారాన్ని రేవంత్ సర్కార్ జీవితకాలం మోయక తప్పదు.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…