హైద్రాబాద్ ను వెంటాడుతున్న వరణుడు…

ఈ మధ్యకాలంలో హైద్రాబాద్ ఎప్పుడు వార్తలలో నిలుస్తూ ఉంది. అయితే ఇందుకు కొత్త పరిశ్రమలు హైద్రాబాద్ లో కొలువుతీరడమో, లేక ఉన్న పరిశ్రమలే పెద్ద ఎత్తున విస్తరణకు పాల్పడడమో లేక హైద్రాబాద్ లో హైడ్రా కూల్చివేతలో, మెట్రో పనుల్లో ఇందుకు కారణం కాదు.

వర్షాలు…గత కొన్ని నెలల నుంచి హైద్రాబాద్ ను వరణుడు వెంటాడుతున్నారు. అసలే భాగ్య నగరంలో ట్రాఫిక్ సమస్య ప్రజలను, వాహనదారులను వేధిస్తుంటే ఇప్పుడు ఈ భారీ వర్షాలు హైద్రాబాద్ వాసుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి.

ADVERTISEMENT

కుండపోతగా కురుస్తున్న వర్షాల దెబ్బకి హైద్రాబాద్ నగరం వరద నీటితో బుదరగా మారుతుంది. వానలు కాస్త తెరపించాయి, జనజీవనం తిరిగి కుదుట పడింది, ఎవరి పనులకు వారు వెళ్తున్నారు అనుకునే లోపే మళ్ళీ క్లౌడ్ బస్ట్ మాదిరి హైద్రాబాద్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి.

అయితే అవి ప్రకృతి ప్రకోపానికో లేక వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులకు సంకేతాలుగా భావించినప్పటికీ అందుకు అనుగుణంగా మహా నగరాన్ని తీర్చిదిద్దలేకపోతున్నారు అధికారులు, ప్రభుత్వాలు. కొద్దీ పాటి వర్షాన్ని సైతం హైద్రాబాద్ మహానగరం తట్టుకోలేకపోతుంది.

వరదలతో అల్లాడుతోంది. మూసి ప్రక్షాళన అంటూ ప్రభుత్వం ముందుకొచ్చినా, హైడ్రా అంటూ అక్రమ నిర్మాణాలను కూల్చివేసినా వరణుడు దాటికి హైద్రాబాద్ చిగురుటాకులా వణికిపోతోంది. హైద్రాబాద్ కు పరిశ్రమల అభివృద్ధి ఎంత ప్రధానమో, విపత్తులను తట్టుకునే ఏర్పాట్లు చేయడం కూడా అంతే కీలకం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali Trailer: Intent Shows, Excitement Missing!

Ranabaali marks the second collaboration between director Rahul Sankrityan and Vijay Deverakonda. Set against a…

7 minutes ago

Can Jagan Undo 4 Years In 1 Year Now?

It has been more than a couple of years since the formation of the NDA…

47 minutes ago