వైరల్ వీడియో: నిర్లక్ష్యమా.? బరితెగింపా.?

Drunk biker caught in Hyderabad viral video

డ్రంక్ అండ్ డ్రైవ్ మీద సినీ సెలబ్రేటిస్ నుంచి రాజకీయ నాయకుల వరకు, అటు పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వరకు అందరు ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పిస్తూనే వస్తున్నారు.

ఒకరి వ్యసనం మరొకరి మృత్యు కి శాపం కాకూడదు అంటూ ఎంతగా చెపుతున్నా ఇప్పటికి కొంతమంది డ్రంక్ డ్రైవ్ తో రోడ్ల మీదకు వస్తు వాహనాలతో అమాయకుల ప్రాణాలు బలితీసుకుంటూనే ఉంటున్నారు.

ADVERTISEMENT

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక హైదరాబాదీ టూ వీలర్ వాహనదారుడు విన్యాసం చూసి ఇతనిది నిర్లక్ష్యమా.? బరితెగింపా.? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

టూ వీలర్ నడుపుతున్న ఒక వ్యక్తి చేతిలో బీరు బాటిల్ పట్టుకుని బైక్ నడుపుతూ, బీరు తాగుతూ సైఫాబాద్ జంక్షన్ – లక్డికాపూల్ రోడ్డు మీద హల్ చల్ చేస్తున్నాడు. అయితే సదరు వ్యక్తి చేస్తున్న ఈ చట్ట వ్యతిరేక పనిని తోటి వాహనదారుడు తన ఫోన్లో బంధించి ఆ వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

దీనితో ఆ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ అయ్యింది. వీడియో లో బీరు తాగుతూ టూ వీలర్ నడుపుతున్న వ్యక్తి బండి నెంబర్, ఆయన ముఖం స్పష్టంగా రికార్డు అవ్వడంతో హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీసులు బండి నెంబర్ సాయంతో సదరు వ్యక్తిని ట్రేస్ చేసి పట్టుకున్నట్టు తెలియచేసారు.

నిందితుడి మీద కేసులు పెట్టి అరెస్టు చేసినట్టు తెలియయచేసిన పోలీసులు ఇలా తాగి డ్రైవ్ చేస్తూ రోడ్ల మీద నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు.

అయితే తాగి డ్రైవ్ చేస్తూ ఆ వాహనదారుడు ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాడో, అతని వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేసి తోటి వాహనదారుడు అంతే బాధ్యతగా వ్యవహరించాడంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన వ్యక్తి పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే చర్యలు తీసుకున్న పోలీసు అధికారుల పని తీరు పై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories