షర్మిల వస్తే లోక్‌సభకే… కడప నుంచే పోటీ?

వైఎస్ షర్మిల రాక కోసం ఏపీ కాంగ్రెస్‌ మాత్రమే కాదు… వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డితో సహా ఆయన వెంట ఉండేవారు, వైసీపిలో నుంచి బయటపడాలనుకొనేవారు, టిడిపి, జనసేన, వామపక్షాలు, మీడియా, రాజకీయ విశ్లేషకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ విజయానికి టిడిపి పరోక్షంగా తోడ్పడింది కనుక ఏపీలో టిడిపికి కాంగ్రెస్‌ తోడ్పడవచ్చు. కనుక శాసనసభ ఎన్నికలలో వాటికి నష్టం కలగకుండా ముందుకు సాగాలని కాంగ్రెస్‌ అధిష్టానం ఆమెకు ముందే సూచించి ఏపీకి పంపించవచ్చు.

ADVERTISEMENT

ఇదీగాక వైఎస్ షర్మిల ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టినా శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించలేరు. ఇప్పటికే ఏపీలో వైసీపి, టిడిపి, జనసేన, బీజేపీ, వామపక్షాలు శాసనసభ సీట్ల కోసం పోటీ పడుతున్నాయి. కనుక వైఎస్ షర్మిల వస్తే శాసనసభ కంటే లోక్‌సభ ఎన్నికలకే ప్రాధాన్యం ఈయవచ్చు.

ఈసారి కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావడం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. లేకుంటే వచ్చే ఎన్నికల నాటికి దేశంలో కాంగ్రెస్ పార్టీ కనపడకుండా పోయే ప్రమాదం ఉంటుంది. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్‌కు ఎంపీ సీట్లే చాలా అవసరం. కనుక వైఎస్ షర్మిలతో సహా ఏపీ కాంగ్రెస్‌ ముఖ్యనేతలందరూ లోక్‌సభకే పోటీ చేయవచ్చు.

టిడిపి, జనసేనలకు శాసనసభ ఎన్నికలే ముఖ్యం. కనుక అవి శాసనసభ ఎన్నికలపైనే దృష్టిపెట్టి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌తో సర్దుబాట్లు చేసుకోవచ్చు.

కనుక వైఎస్ షర్మిల లోక్‌సభకు పోటీ చేయాలనుకొంటే ఆమె మొదటి ఆప్షన్ కడప అని వేరే చెప్పక్కరలేదు. ఒకవేళ ఆమె అక్కడి నుంచి పోటీ చేస్తే వివేకానంద హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సీబీఐ చుట్టూ తిరుగుతున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఓటమి ఖాయం.

నిజానికి ఈసారి ఆయన స్థానంలో సిఎం జగన్మోహన్‌ రెడ్డి భార్య భారతి లోక్‌సభకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ కడప నుంచి వైఎస్ షర్మిల లోక్‌సభకు పోటీకి సిద్దమైతే ఆమె ఆ ఆలోచన విరమించుకోవచ్చు లేదా వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

బూతులు కూడా తిట్టారటగా.. సగం సగం చెప్తే ఎలా సాయి?

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల…

22 minutes ago

Dhurandhar Ruined Spy Universe: Is Karthi Next in Line?

Recently, the trailer of Karthi's most anticipated sequel Sardar 2 directed by PS Mithran, was…

29 minutes ago