నెట్టింట ‘గోవా బ్యూటీ’ ఇలియానా బొమ్మ కనపడగానే క్లిక్ చేస్తున్నారా? అలాగే ఇలియానా పేరుతో ఉన్న వీడియోలపై క్లిక్ చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే ఇలియానా ప్రస్తుతం ‘మోస్ట్ డేంజరస్ బ్యూటీ’గా అవతరించింది. అమెరికన్ గ్లోబల్ కంప్యూటర్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ సంస్థ వెల్లడించిన సర్వే ప్రకారం ఇలియానా ‘మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటీ’గా డిక్లేర్ చేసారు.
ADVERTISEMENT
[m9ad]
హ్యాకర్లు ఇలియానా పేరును, ఫోటోలను ఉపయోగిస్తూ నెటిజన్లను వల వేస్తున్నారని, సైబర్ స్పేస్ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న కపిల్ శర్మను దాటి మరీ ఇలియానా పేరు మొదటి స్థానంలో నిలవడం ప్రాధాన్యతను దక్కించుకుంది. టాలీవుడ్, బాలీవుడ్ లలో అవకాశాలు సరిగా లేకపోయినా, ఈ గోవా బ్యూటీపై క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పడానికి నిదర్శనంగా దీనిని పేర్కొనవచ్చు.
ADVERTISEMENT



