IMDB టాప్ జోక్స్ – ధనుష్ నెంబర్ వన్నా?

IMDB Top Ten List Is Dhanush Number Oneభాషతో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ రిలీజయ్యే సినిమాలకు ఐఎండిబిలో వచ్చే రేటింగులకు ఎంత ప్రామాణికత ఉంటుందో అందరికీ తెలిసిందే. పది ఇరవై సంవత్సరాల క్రితం వీటి స్టాండర్డ్ మీద గట్టి నమ్మకం ఉండేది కానీ క్రమంగా ఇవి కూడా వివిధ అంశాల పట్ల ప్రభావితం చెందుతుండటంతో మెల్లగా విశ్వసనీయత తగ్గుతోంది. తాజాగా 2022కి సంబంధించి టాప్ 10 మోస్ట్ పాపులర్ స్టార్స్ పేరుతో విడుదల చేసిన లిస్టు పెద్ద జోక్ గా ఉందని సోషల్ మీడియాలో నెటిజెన్లు బాహాటంగానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సదరు సంస్థ అఫీషియల్ గా ఇచ్చిన జాబితా ప్రకారం తమిళ స్టార్ హీరో ధనుష్ కి నెంబర్ కిరీటం కట్టబెట్టారు. అనుమానం ఇక్కడే మొదలైంది

ధనుష్ గొప్ప యాక్టరే అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అసురన్, వడ చెన్నై, కర్ణన్ చూసినవాళ్లు ఎవరైనా ఈ మాట ఒప్పుకుని తీరతారు. కానీ ఇవన్నీ ఈ ఏడాది వచ్చినవి కాదు. అతను ఈ సంవత్సరం చేసినవి చూస్తే మొదటిది మారన్. డైరెక్ట్ ఓటిటిలో వచ్చింది. ఎంత గొప్ప కళాఖండమంటే రెండు దాటి రేటింగ్ ఇవ్వడానికి ఏ విమర్శకుడికి మనసు రానంత దారుణంగా ఫ్లాప్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ కోసం చేసిన ది గ్రే మ్యాన్లో తనది చాలా పరిమితమైన సపోర్టింగ్ రోల్. పేరు కూడా సోసోనే. అవెంజర్స్ తీసిన రస్సో బ్రదర్స్ ఇలాంటి మూవీ తీశారనే విమర్శలే ఎక్కువగా వచ్చాయి. తిరు ఒకటే తమిళ వెర్షన్ బాగా ఆడి డబ్బులతో పాటు తనకో హిట్టు తెచ్చి పెట్టింది.

ADVERTISEMENT

ఇక నేనే వస్తున్నా గురించి చెప్పేదేముంది. ఇదేం థ్రిల్లర్ రా బాబోయ్ అంటూ జనం పరుగులు పెట్టారు. పాపులర్ అంటే ప్రఖ్యాతి గాంచిన వాడని కదా అర్థం. ఆర్ఆర్ఆర్ రేంజ్ ఏ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రీచ్ అయ్యిందో చూశాం. రామ్ చరణ్ తో జేమ్స్ బాండ్ మూవీ తీయొచ్చని, జూనియర్ ఎన్టీఆర్ తో సూపర్ మ్యాన్ లాంటి గ్రాండియర్ ప్లాన్ చేయొచ్చని విదేశీయులు ఎందరో వందలాది ట్వీట్లు పెట్టారు. జపాన్ కు వెళ్తే అక్కడి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. మరి ధనుష్ ని ఈ స్థాయిలో గుర్తుపడతారా. అలియా భట్ కు రెండో స్థానం ఇచ్చారు. తన పాపులారిటీ ఇండియా దాటి ఏ ఏ దేశాల్లో ఉందంటే దానికి గంగుబాయ్ ఓటిటి వ్యూస్ లెక్క చూపిస్తారేమో

ఇదింత తప్పుల తడకగా ఉంది కాబట్టి రామ్ చరణ్ నాలుగో ప్లేస్ లో తారక్ ఏకంగా ఎనిమిదో ర్యాంక్ లో ఉండాల్సి వచ్చింది. రష్యాకు పుష్ప 1ని తీసుకెళ్లిన అల్లు అర్జున్ తొమ్మిదితో సర్దుకున్నారు. పాపులర్ అన్నప్పుడు సదరు హీరో లేదా హీరోయిన్ ఏ స్థాయిలో తమ ఉనికిని చాటుకున్నారనే దాన్ని బట్టి ఇవ్వాలి కానీ ఏదో కొన్ని వేల మంది ఇచ్చిన రేటింగ్స్ ని బట్టి కాదుగా. ఇంకో కామెడీ ఏంటంటే పన్నెండు వందల కోట్లు సాధించిన కెజిఎఫ్ 2 యష్ చిట్టచివరిలో ఉండగా విక్రమ్ వేదాతో పరమ యావరేజ్ రీమేక్ ఇచ్చిన హృతిక్ రోషన్ ఆరో స్థానంలో ఉన్నాడు. కొంతలో కొంత నయం సమంతాకు చోటు దక్కింది. ఫైనల్ గా పాపులర్ కు మీనింగ్ ఏంటో సదరు ఐఎండిబి చెబితే బాగుంటుంది.

ADVERTISEMENT
Latest Stories