అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ గా భారీ అంచనాలతో విడుదలైన ‘ఫ్రీడం 251,’ ఆ అంచనాలను అందుకోలేక విఫలమైంది. ఒక వైపు వెబ్ సైట్ లో ఫోన్ బుకింగ్స్ జరగలేక పోతుండడం, మరో వైపు ఈ సంస్థపై అనేక విషయాలు వెలుగులోకి రావడంతో ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడంలో విఫలమైంది. దీంతో తొలిరోజు కేవలం 30 వేల ఫోన్లు వరకే బుకింగ్స్ జరిగినట్లు సదరు సంస్థ తెలిపింది.
ఇదిలా ఉంటే, ఈ సంస్థ ఉన్న ఢిల్లీ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ముగ్గురు సభ్యులతో కూడిన బృందం నోయిడాలోని ‘ఫ్రీడం 251’ కంపెనీ కార్యాలయాన్ని సందర్శించి విచారణ చేసారు. సదరు సమాచారం అందుకున్న వినియోగదారులు రింగింగ్ బెల్స్ కార్యాలయం చుట్టూ గుమిగూడి ఆందోళన చేసారు. జరుగుతున్న తాజా పరిణామాలు ఈ ఫోన్ బుకింగ్స్ ను మరింతగా దెబ్బ తీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



