టీమిండియా బ్యాటింగ్ విభాగం ప్రస్తుతం ప్రత్యర్థి జట్లకు భయాన్ని కలిగిస్తుంది. ఐపిల్ నుంచి వచ్చిన యువ టాలెంటెడ్ ఆటగాళ్లు తమ దూకుడైన అట తో భారత్ బ్యాటింగ్ పటిష్టంగా కనిస్తుంది. టాప్ ఆర్డర్ నుంచి ఫినిషేర్ల వరకు ప్రతి ఒక్కరు జట్టు కోసం తమ పూర్తి సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
అయితే బ్యాటింగ్ లైన్ అప్ ఇంత బలంగా ఉన్న టీం ఇండియా లో బౌలింగ్ విభాగం మాత్రం ఒక్క ఆటగాడి మీదే ఆధారపడి ముందుకెళ్తుంది. అతనే జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా టీం లో లేడు అనే వార్తే టీం ఇండియా అభిమానులను కలవరపెట్టే స్థాయికి వెళుతుంది.
అతడు జట్టులో లేకపోతె భారత బౌలింగ్ పదును తగ్గిపోతుందనే విషయం ఎన్నోసార్లు స్పష్టమయింది. ప్రత్యర్థి బ్యాటర్ల పై తన బాల్ తో ఒత్తిడి సృష్టించే బౌలర్ లేకపోవడంతో పరుగుల నియంత్రణ కష్టంగా మారుతుంది. బుమ్రా లేని లోటు తాజాగా జరిగిన ఏ సిరీస్ లలో స్పష్టంగా కనిపించింది.
2024 టి20 ప్రపంచ కప్ తో పాటుగా 2026 టీ20 ప్రపంచ కప్ విజయంలోనూ బుమ్రాన్ భర్త విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు. పవర్ ప్లే లో వికెట్లు పడగొట్టడం, మిడిల్ ఆర్డర్ కి పరుగులు కట్టడి చేయడం, డెత్ ఓవర్లలో మ్యాచ్ ను ముగించడం వంటి అన్ని కీలక ఘట్టాలలో తనదయిన ప్రతిభ కనపరిచి భారత్ కు రెండు ట్రోఫీలు అందించాడు ఈ స్పీడ్ బౌలర్ బుమ్రా.
2020 దశాబ్దం ప్రారంభమైనప్పటి నుంచి భర్త బౌలింగ్ కు అతడే వెన్నుముక గా నిలుస్తున్నాడు. మ్యాచ్ క్లిష్ట పరిస్థితులలో కెప్టెన్ మొదట తలచుకుని పేరు బుమ్రా. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అతనే జట్టుకు ప్రధాన బౌలర్ గా ఉంటూ వస్తున్నాడు.
ఐపిల్, వన్ డే, టీ 20, టెస్ట్ ఇలా ఫార్మాట్ ఏదైనా బుమ్రా ను సరిపోల్చే బౌలర్ ప్రస్తుతం భారత్ లో లేదు అంటే అతిశయోక్తి కాదేమో. అయితే ప్రతి సిరీస్, ప్రతి టోర్నీ లో బుమ్రా పైనే ఆధారపడడం దీర్ఘకాలంలో సరైన వ్యహం కాదు అనే వాదన కూడా వినిపిస్తుంది. బాటర్లలో ఎలా అయితే కొత్త టాలెంట్ టీం ఇండియా కు వెన్నుముక గా నిలుస్తుంది అలానే బౌలింగ్ విభాగంలో కూడా బుమ్రా సాత్యి బౌలర్లను టీం ఇండియా వెతికి అపట్టుకోవాలి.
అటువంటి వారికీ సాన పట్టి పదును పెట్టాలి. అప్పుడే బవిషయ్త్ లో టీం ఇండియా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ అన్ని విభాగంలోను సమర్ధవంతమైన జట్టుగా రాణించగలుగుతుంది. నాటి శ్రీనాధ్ నుంచి మొదలు పెడితే అగార్కర్, జహిరాఖాన్, బుమ్రా వంటి ఎందరో భారత్ బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేస్తూ వస్తున్నారు.
ఇక సిరాజ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా, ప్రిన్స్ యాదవ్ వంటి యువ బౌలర్ల ప్రతిభకు కొదవ లేడకపోయినా బుమ్రా మాదిరి నిలకడ, మ్యాచ్ విజయం పై ప్రభావం చూపే సామర్ధ్యం ఇంకా ఎవరిలోనూ పూర్తిగా బయటకు రాలేదు. భారత్ జట్టుకు కేవలం వేగవంతమైన బంతులు వేసే బౌలర్ మాత్రమే కాదు, క్లిష్ట పరిస్థితులలో కెప్టెన్ నమ్మకంగా బంతి అందించే ‘గో టూ బౌలర్’ కావాలి.




