ఆసియా కప్ లో నమోదవుతున్న సంచలనాల పరంపర ఫైనల్లో కూడా కొనసాగుతుందా? ఈ సిరీస్ లో ఇప్పటికే ఆఫ్ఘన్ జట్టు, టీమిండియాతో సహా మిగిలిన అన్ని జట్లకు జలక్ ఇవ్వగా, సూపర్ 4లో పాకిస్తాన్ కు షాక్ ఇచ్చి బంగ్లాదేశ్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తుదిపోరు ప్రారంభం కానుంది.
[m9ad]
ఈ మ్యాచ్ లో టీమిండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్నప్పటికీ, బంగ్లాదేశ్ ను ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి ఆస్కారం లేదు. నిజానికి పాకిస్తాన్ పై సాధించిన అలోవోక విజయం బంగ్లాను నూతన ఉత్సాహంలోకి నెట్టి, అదే కోవలో టీమిండియాకు కూడా కోలుకోలేని షాక్ ఇవ్వాలని భావిస్తోంది.
ఫ్లాష్ బ్యాక్ పరిశీలిస్తే… వరల్డ్ కప్ నుండి టీమిండియా తొలి స్టేజ్ లోనే వైదొలగడానికి బంగ్లాదేశ్ కారణం కాగా, ఇతర సందర్భాలలో కూడా టీమిండియాపై విజయాలు సాధించిన ట్రాక్ రికార్డు బంగ్లా సొంతం. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న బంగ్లాను టీమిండియా అవలీలగా నిలువరిస్తుందా? లేక కష్టపడి సాధిస్తుందా? అనేది వేచిచూడాలి.



