ఆఫీసర్ సినిమా… ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్… రెండూ ఒక్కటే..!

India-Vs-Afghanistanరాంగోపాల్ వర్మ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా నటించిన “ఆఫీసర్” సినిమా కేవలం రెండే రెండు రోజుల్లో తిరుగుపయనం అయిన విషయం తెలిసిందే. ఇలా ఓ పెద్ద సినిమా రెండు రోజుల్లో ముగిసిపోయిన రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ కూడా రెండు రోజుల్లో ముగిసిపోయింది.

బెంగుళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 474 పరుగులకు ఆలౌట్ కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 27.5 ఓవర్లను ఎదుర్కొని 109 పరుగులకు ఆలౌట్ కాగా, ఫాలో ఆన్ ఇన్నింగ్స్ లో 38.4 ఓవర్లను ఎదుర్కొని కేవలం 103 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 262 పరుగుల భారీ విజయం టీమిండియా సొంతమైంది.

ADVERTISEMENT

ఆఫ్ఘన్ తొలి ఇన్నింగ్స్ ను రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లతో పతనం చేయగా, రెండవ ఇన్నింగ్స్ ను మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా 4 వికెట్లతో నేలకూల్చాడు. దీంతో అయిదు రోజుల టెస్ట్ మ్యాచ్ కాస్త రెండు రోజుల్లోనే ఫలితం వచ్చేసింది. ఇండియాలోనే కాదు, ఏషియన్ పిచ్ లపైన ఒక టెస్ట్ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లో ముగిసిపోవడం ఇదే ప్రధమం.

ADVERTISEMENT
Latest Stories