‘విరాట్ కోహ్లి అండ్ కో’ ఆశాభంగం!

India vs England, 5th Test England beat Indiaఇంగ్లాండ్ టూర్ కు వెళ్ళే ముందు వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న విరాట్ కోహ్లి అండ్ కో, ఇంగ్లాండ్ లో కూడా అద్భుతాలు సృష్టిస్తుందని భావించారు. అయితే అందుకు ఆస్కారం లేకుండా మరోసారి ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా పేలవమైన ప్రదర్శనను ఇచ్చి, అయిదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను 4-1 తేడాతో కోల్పోయింది.

ADVERTISEMENT

[m9ad]

గతంతో పోలిస్తే మెరుగుగానే రాణించినప్పటికీ, కీలకమైన దశలో వచ్చిన విజయావకాశాలను దక్కించుకోవడంలో విఫలం కావడంతో, సిరీస్ 4-1 తేడాతో కోల్పోవలసి వచ్చింది. బహుశా అందివచ్చిన అవకాశాలను ఒడిసి పుచ్చుకున్నట్లయితే ఇదే ఫలితం ఇంగ్లాండ్ కు అంది ఉండేది. బౌలింగ్ విభాగంలో అందరూ బాగా రాణించగా, బ్యాటింగ్ లో మాత్రం విరాట్ కోహ్లి తప్ప మిగతా వారంతా పూర్తిగా విఫలమయ్యారు.

టెస్ట్ మ్యాచ్ లంటే సమిష్టి కృషి తప్పనిసరి. ఆ సమిష్టి లోపం వలనే, నేడు టీమిండియా పరాజయం వైపు నిల్చుంది. క్యాచ్ లను పట్టుకోవడంలో విఫలం కావడం… ఆత్మవిశ్వాసం లేకుండా బ్యాటింగ్ కు చేయడం… వంటివి ఈ టూర్ లో టీమిండియా నేర్చుకోవలసిన గుణపాఠాలు. ఏది ఏమైనా విరాట్ కోహ్లి అండ్ కోపై ఆశలు పెట్టుకున్న క్రికెట్ అభిమానులకు ఈ టెస్ట్ సిరీస్ చేదు అనుభవాన్ని మిగిల్చింది.

ADVERTISEMENT
Latest Stories