ఫస్ట్ డే – డకౌట్ టు డకౌట్!

India vs England Test cricket match 2018లార్డ్స్ వేదికగా మొదలైన రెండవ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజులోనే టీమిండియాను చావుదెబ్బ తీసింది ఇంగ్లాండ్ జట్టు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు తొలి ఓవర్ నుండే ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. విజయ్ డకౌట్ తో ప్రారంభమైన ఇన్నింగ్స్ ఇషాంత్ శర్మ డకౌట్ తో ముగిసింది. ఈ మధ్యలో మిగతా బ్యాట్స్ మెన్లు అంతా కలిపి 107 పరుగులు మాత్రమే సాధించారు.

ADVERTISEMENT

[m9ad]

స్వింగ్ డెలివరీలను ఎదుర్కోవడంలో విఫలమైన టీమిండియా బ్యాట్స్ మెన్లు ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయారు. రవిచంద్రన్ ఆశ్విన్ 29, కోహ్లి 23 పరుగులే టీమిండియా బ్యాట్స్ మెన్లలో అత్యధిక స్కోర్లు. మొత్తమ్మీద 35.2 ఓవర్లలో తొలి రోజే చాపచుట్టేయడంతో, ఇంగ్లాండ్ కు పూర్తి ఆధిపత్యం లభించినట్లయ్యింది. వరుణుడు కూడా ఆతిధ్య జట్టుకు బాగా సహకరించడం టీమిండియాకు మరో మైనస్.

ADVERTISEMENT
Latest Stories