
ఇటీవలే, న్యూజిలాండ్ జట్టు భారత్ పర్యటన కు వచ్చి, ఎవ్వరూ కలలో కూడా ఊహించని విధంగా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే మొట్ట మొదటి సారి భారత్ ను సొంత గడ్డ మీద ఘోరంగా దెబ్బ తీసింది. ఇంతటి చారిత్రాత్మక సిరీస్ విజయం తరువాత, మూడవ టెస్ట్ కు రంగం సిద్ధమైంది.
నేడు ముంబై లో ని ‘వాంఖిడి’ స్టేడియం వేదికగా మూడవ టెస్ట్ కు ఇరు జట్టులు సర్వం సిద్ధమయ్యారు. అయితే, 18 హోమ్ సిరీస్ లు పరాజయం అనేది చూడకుండా వచ్చిన భారత్ పరంపరకు న్యూజిలాండ్ భయంకరమైన బ్రేక్ వేసింది. అయితే, భారత్ వంటి ఉత్తమ జట్టు ఇటువంటి సమయాల్లో సరైన కమ్-బ్యాక్ ఇస్తారని అభిమానులు విశ్వసిస్తున్నారు.
మరి ఇంతటి ఘోర ఓటముల తరువాత భారత్ ప్రదర్శన ఎలా ఉంటుందా అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా, భారత్ హోమ్ టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ అయ్యి ఏకంగా 24 ఏళ్ళు అవుతుంది. దీనితో 3 మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే న్యూజిలాండ్ 2 – 0 తో సిరీస్ ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ కూడా ఓడితే, భారత్ తానూ సొంతగడ్డ మీద 24 ఏళ్లుగా కాపాడుకుంటున్న తన వైట్ వాష్ లేని ఓటమి రికార్డు ను కూడా తుడిచిపెట్టవలసి వస్తుంది.
దీనికి తోడు,టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు భారత్ అర్హత సాధించాలి అంటే, ఈ మ్యాచ్ లో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఇంకా 6 టెస్టులు మిగిలుండగా, 5 టెస్టులను ఆస్ట్రేలియా వెళ్లి ఆస్ట్రేలియా పై ఆడాల్సి ఉండగా, ఇప్పుడే ఒక మ్యాచ్ గెలవటం అన్నిటికి మంచిది. ఈ మ్యాచ్ గెలిస్తే, అటు ఫైనల్ స్పాట్ ను కాపాడుకోవచ్చు, ఇటు పరువు పోకుండా జాగ్రత్త పడవచ్చు.
మరి ఇవాళ జరగనున్న మూడవ టెస్ట్ లో ఈ సిరీస్ లో జరిగినట్టే యధావిధిగా, న్యూజీలాండ్ వారే మొదటి రోజు నుండి భారత్ పై ఆధిపత్యం చెలాయిస్తారా..లేదా పరిస్థితి తారుమారయ్యి భారత్ తన హోమ్ డామినెన్స్ ను చూపిస్తారా అని తెలియాలి అంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే..చూడాలి మరి ఈ టెస్ట్ ను సొంతం చేస్కుని భారత్ ఫైనల్ వైపు అడుగులు వేస్తారా లేదా అని..?
Kamiya Jani has been a popular face on social media for her way of interacting…
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…