IND vs Bangladesh Test Series

సెప్టెంబర్ 27 న మొదలయిన ఇండియా vs బాంగ్లాదేశ్ రెండవ టెస్ట్ మొదటి రోజే వాన అంతరాయం వలన టాస్ కూడా ఆలస్యం గా మొదలుపెట్టారు. అయితే, టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. మొదటి రోజే వాన జోరుగా కురవడం వలన, కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే జరిగి, మిగతా 55 ఓవర్ల ఆట వర్షార్పణం అయింది.

ఇది ఆలా ఉండగా, డే-2 , 3 అయితే కనీసం ఒక్క బాల్ కూడా ఆడకుండానే ముగిసాయి. ఇలాంటి సమయంలో, డబ్ల్యు.టీ.సి ఫైనల్ దృష్ట్యా,భారత్ నేరుగా ఫైనల్ కు అరహత సాధించాలంటే ఈ మ్యాచ్ గెలవటం అందుకు ఎంతో కీలకం.మరోపక్క బంగ్లా ఫైనల్ రేస్ లో ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరి గెలవాల్సి ఉంది. ఇలాంటి మ్యాచ్ డ్రా గా ముగిస్తే ఎవరికీ ఉపయోగం ఉండదు.

Also Read – సొంత మీడియాలో డప్పు కొట్టుకుంటే చాలా?

ఇక డే-4 లో భారత్ ఆట ప్రణాళిక చూస్తే వారు కేవలం గెలుపు కోసమే బరి లో కి దిగారు అని స్పష్టమైంది.రెండున్నర రోజుల ఆట కోల్పోయిన టెస్ట్ కు రిసల్ట్ వస్తుంది అని ఎవరు ఊహించలేదు. మనం చూస్తున్నది టెస్ట్ ఆ?లేదా వైట్ జెర్సీ వేసుకు ఆడుతున్న టి-20 అనే సందేహాలు రాక తప్పవు భారత్ బ్యాటింగ్ చూస్తే.

మొదటి ఇన్నింగ్స్ లో 285 పరుగులు చేసి డిక్లేర్ చేయగా, డే-4 లో నే ఇద్దరు బంగ్లా బ్యాటర్లను పెవిలియన్ కు పంపసాగారు. ఇక ఆఖరి రోజు ఆట మొదలయిన పది నిముషాలకే అశ్విన్ మరో వికెట్ తీసి గెలుపు దిశగా నడిపించారు.అదే క్రమం లో మొదటి సెషన్ కె బంగ్లా బ్యాట్టర్లను అల్ అవుట్ చేసారు భారత బౌలింగ్ దళం.

Also Read – విశ్వంభర VFX ఎక్కడ తేడా కొట్టింది?

లంచ్ చేసి వచ్చినా, పరుగుల ఆకలి ఇంకా తగ్గలేదు అన్నట్టు కేవలం 3 విక్కెట్లకే 98 పరుగులను 17 ఓవర్లలో అందుకుని, ఒక చారిత్రాత్మిక విజయాన్నందుకున్నారు.ఈ మ్యాచ్ ద్వారా ఎన్నో రికార్డ్స్ బద్దలయ్యాయి. అందులో;మొదటిగా,ఫాస్టెస్ట్ టీం 50 ,100 ,150 ,200 మరియు 250 .ఇండియా లో జరిగిన టెస్ట్ ల లో 4 ఇన్నింగ్స్ కలిపి అత్యధిక రన్-రేట్(4 .4 ) ఉన్న టెస్ట్ గా ఈ మ్యాచ్ నిలిచింది.

ఒకే టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లో 100 + స్ట్రైక్ రేట్ తో 50 కొట్టిన బ్యాటర్ గా యశస్వి నిలిచాడు. రెండు రోజుల ఆట కోల్పోయాక కూడా, రిసల్ట్ వచ్చిన 9 వ టెస్ట్ గా నిలిచింది.7 .36 రన్ రేట్ తో,ఒకే టెస్ట్(రెండు ఇన్నింగ్స్)లో ఒక టీం తరుపున అత్యధిక రన్ రేట్ గా చరిత్రలోకెక్కింది.పైగా అత్యంత తక్కువ బాల్స్ ఆడి విజయాన్ని అందుకున్న 4 వ మ్యాచ్ గా నిలిచింది భారత్.

Also Read – రాజకీయాలలోకి షాయాజీ షిండే… ఎమ్మెల్యే అనిపించుకుంటే చాలట!

ఈ విజయంతో టెస్ట్ చరిత్ర లో నే అత్యధిక విజయాలు(180 ) ఉన్న టీం ల లో భారత్ నాల్గవ స్థానానికి వెళ్ళింది. వెస్ట్ ఇండీస్ 183 తో మూడవ స్థానం లో ఉండగా, ఆ స్థానాన్ని ఈ ఏడే భర్తీ చేస్తుందనే ధీమా తో ఉన్నారు అభిమానులు. పైగా వరుసగా 18 హోమ్ టెస్ట్ సిరీస్ లు గెలిచి ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నారు టీం ఇండియా.

ఈ మ్యాచ్ లో తన బ్యాట్టింగ్ తో ఆకట్టుకున్న యశస్వి కు ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’ అవార్డు ఇవ్వగా, తన అల్-రౌండ్ షో తో మరోసారి ‘మ్యాన్ అఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నారు రవి అశ్విన్. ఈ అవార్డు ను 11 సార్లు అందుకున్న అశ్విన్,ప్రస్తుతం మురళీధరన్ తో సమంగా మొదటి స్థానం లో ఉన్నారు.ఇన్ని రికార్డ్స్ బద్దలుకొట్టిన ఈ మ్యాచ్ “అభిమానులకు మాంచి కిక్ ఇచ్చింది” అనడం లో అతిశయోక్తే లేదు…!