
రాష్ట్రంలో, దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం, చక్కటి విధానాలు, ప్రోత్సాహకాలు ఉంటేనే పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయి. జగన్ పాలనలో ఇవన్నీ కొరవడటమే కాకుండా అవినీతి, వేధింపులు, విద్యుత్ కోతలు, చార్జీల మోత వంటి సకల అవలక్షణాలు కూడా ఉండేవి. అందువల్లే ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు రాకపోగా ఉన్నవి కూడా మూతపడ్డాయి. కొన్ని ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి.
కనుక కూటమి ప్రభుత్వానికి పరిశ్రమలు, పెట్టుబడులు సాధించడం కంటే ముందు వారికి మళ్ళీ ఏపీలో పెట్టుబడులు పెట్టడం వలన ఎటువంటి ఇబ్బందులు కలుగవని, భవిష్యత్‌లో కూడా ఉండవనే నమ్మకం కల్పించడమే పెద్ద పనైపోయింది.
కానీ పరిశ్రమలు, పెట్టుబడిదారులకు చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న నమ్మకమే ఇప్పుడు ఏపీకి శ్రీరామరక్షగా నిలుస్తోంది. ఆయన హైదరాబాద్‌లో ఐటి రంగాన్ని తీసుకువచ్చి ఐటి కంపెనీలు నిలదొక్కుకునేందుకు, వాటికి అవసరమైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లని అందించేందుకు ఏవిదంగా కృషి చేశారో అందరికీ తెలుసు.
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కేంద్రంలో కీలకంగా మారడం కూడా రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చేందుకు ఒక బలమైన కారణంగా చెప్పుకోవచ్చు.
జగన్ ప్రభుత్వంలో మంత్రులతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో మంత్రులు అందరూ చాలా హుందాగా, పద్దతిగా వ్యవహరిస్తున్నారు. కనుక ఏపీలో పరిశ్రమలు, పెట్టుబడులకు పూర్తి సానుకూల వాతావరణం ఏర్పడింది.
అందుకే జపాన్‌కు చెందిన డైకిన్, తైవాన్‌కు చెందిన రెచి ప్రెసిషన్ కంపెనీలు కలిసి ఏపీలో రూ.1,000 కోట్లు పెట్టుబడితో శ్రీసిటీలో ఏసీ కంప్రెషర్స్ తయారుచేసే పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నాయాయి.
దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 75 ఎకరాలు కేటాయించింది. భారతదేశంలో ఈ సంస్థలు కలిసి ఏర్పాటు చేస్తున్న మూడో ప్లాంట్ ఇది. ఆగ్నేయాసియాలో ఇదే అతిపెద్ద ప్లాంట్.
ప్రస్తుతం దేశంలో గల రెండు ప్లాంట్స్‌లో కలిపి ఏడాదికి 20 లక్షల కంప్రెషర్స్ తయారుచేస్తున్నారు. మరో ఏడాదిలోగా శ్రీసిటీలో ఈ ప్లాంట్ కూడా సిద్దమవుతుంది. 2030 నాటికి ఏడాదికి 20 లక్షల కంప్రెషర్స్ తయారుచేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు.
ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 1,500-2000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దీనికి అనుబందంగా ఏర్పాటయ్యే చిన్న చిన్న కంపెనీల ద్వారా మరో 2,000 మందికిపైగా ఉద్యోగాలు, ఉపాది లభిస్తుంది.
జగన్ ప్రభుత్వానికి విశ్వసనీయత లోపించడం వలనే ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు రాలేదు. కానీ ఇప్పుడు ఇటువంటి అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు తరలివస్తున్నాయంటే కూటమి ప్రభుత్వానికి విశ్వసనీయత ఉందని స్పష్టమవుతోంది.
SS Rajamouli has conquered box-office records with larger-than-life storytelling. But there is one thing that…
Following the terrible failure of Toxic, Yash has still not announced his next solo lead…