బిఆర్ఎస్ ఓడిపోవడంలో ఆశ్చర్యమే లేదా..?

తెలంగాణలో టీడీపీ జెండా కనిపించినా సహించలేని బిఆర్ఎస్ నాయకులు ఏపీ రాజకీయాలలో ఎవరి జెండా ఎగరాలో చెప్పడానికి మాత్రం సంకోచించరు. ఢిల్లీలో తెలుగు రాజకీయాల పై చర్చ పెట్టిన కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఓడిపోవడం మీద తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు.

జగన్ తన ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ ఎందుకు ఓడిపోయాడో అర్ధం కాలేదంటూ జగన్ ఓటమి పై తీవ్ర ఆందోళన చెందారు బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్.

ADVERTISEMENT

ఎప్పుడు ప్రజల మధ్యే ఉండే కేతిరెడ్డి వంటి వైసీపీ నాయకుడు కూడా ఓడిపోవడం పై కూడా తన ఆశ్చర్యాన్ని తెలియచేసారు ఈ తెలంగాణ వాది. వైసీపీ 11 సీట్లకే పరిమితమయ్యినప్పటికీ 40 % ఓటు బ్యాంకును సాధించడం మాములు విషయం కాదంటూ వైసీపీ పై తాను ఇన్నాళ్లుగా దాచుకున్న ప్రేమంతా బయటపెట్టారు.

షర్మిలను పావుగా వాడుకుని, పవన్ ను కలుపుకుని పోటీ చెయ్యడం వల్లనే వైసీపీ కి ఈ పరిస్థితి వచ్చిందని లేకపోతే ఏపీలో రాజకీయ వాతావరణం వేరేలా ఉండేదంటూ జోస్యాలు చెపుతున్నారు కేటీఆర్. అయితే వైసీపీ ఓటమి కేటీఆర్ ను ఆశ్చర్య పరిచింది కానీ బిఆర్ఎస్ ఓటమి కేటీఆర్ ను ఆశ్చర్య పరచలేదా.?

అంటే బిఆర్ఎస్ ఓడిపోతుందని కేటీఆర్ ముందుగానే ఊహించారా.? ఇన్నాళ్ళుగా వైసీపీ, బిఆర్ఎస్ మధ్య ఉన్న తెరవెనుక బంధం నేటితో తెరముందుకు తెచ్చారు కేటీఆర్. పరిస్థితి చూస్తుంటే తన పార్టీ ఓటమి కన్నా వైసీపీ ఓటమే కేటీఆర్ ను బిఆర్ఎస్ నాయకులను ఎక్కువగా బాధించినట్టు ఉంది.

తెలంగాణలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఆరు నెలలు గడుసున్నా బిఆర్ఎస్ ఓటమి మీద సమీక్షలు చెయ్యలేక పోయిన కేటీఆర్ ఏపీ రాజకీయాల మీద మాత్రం సమావేశాలు జరుపుతున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని కాదని తన పార్టీ నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా వారిని కట్టడి చేయలేకపోతున్నారు కేటీఆర్.

జగన్ ను అడ్డుపెట్టుకుని గత ఐదేళ్లుగా టీడీపీ మీద బిఆర్ఎస్ చేసిన రాజకీయం, బిఆర్ఎస్ ను అడ్డుపెట్టుకుని జగన్ చేసిన విధ్వంసం రెండింటిని రెండు రాష్ట్రాల ప్రజలు అర్ధం చేసుకున్నారు కాబట్టే రెండు పార్టీలను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు. ఏపీ రాజకీయాలలో తెలంగాణ వాదుల జోక్యం అవసరమా.? అంటే కేటీఆర్ ఎం సమాధానం చెప్పగలరు.

ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిగా దొరల పాలన చేసిన కేసీఆర్, ప్యాలస్ ముఖ్యమంత్రిగా పెత్తందారుల ప్రభుత్వాన్ని నడిపిన జగన్ ఎందుకు ఓడిపోయారో తెలుసుకోవాలంటే ఒక సామాన్య ఓటర్ ను అడిగితే సమాధానం చెప్పగలుగుతారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Mass H-1B Layoffs at Fortinet?

A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…

8 minutes ago

H-1B Applicant Arrested Over False Walmart Accusation

An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…

1 hour ago