రోజా సంతోషం తాత్కాలికమేనా? మళ్ళీ వేటు ఖాయమా?

is-it-temporary-relief-to-ysrcp-mla-rk-rojaఅసెంబ్లీలో అసభ్య ప్రవర్తన కారణంగా ఒక ఏడాది పాటు బహిష్కరణకు గురైన రోజాను తిరిగి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావచ్చంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏం చేయబోతోంది? అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, స్పీకర్ కోడెల శివప్రసాద్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇచ్చిన తీర్పుకు తమ వంతుగా ఏపీ సర్కార్ అసెంబ్లీ నియమ నిబంధనలను కోర్టు ముందుంచాలని, ముఖ్యంగా 212 నిబంధన ప్రకారం అసెంబ్లీ నిర్ణయాలను తప్పుపట్టే అధికారం గానీ, శాసనసభ వ్యవహారాలలో కోర్టులు జోక్యం చేసుకునే అధికారం లేదని గట్టిగా చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ప్రోసీజరల్ మిస్టేక్స్ ను ఆధారంగా చేసుకుని సభ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు ప్రశ్నించజాలవని డివిజినల్ బెంచ్ కు వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ADVERTISEMENT

దీంతో ప్రభుత్వ నియమ నిబంధనలతో కోర్టు ఏకీభవిస్తే… రోజాపై ఇచ్చిన మధ్యంతర తీర్పు రద్దయ్యే అవకాశం కూడా ఉంటుందని మీడియా వర్గాల వేదికగా కధనాలు ప్రసారమవుతున్నాయి. మొత్తానికి తనకు న్యాయం జరిగింది అని సంతోషం వ్యక్తం చేసిన రోజాకు ఈ సంతోష సమయం ఎంతసేపు ఉంటుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories