
ఒక మామూలు విషయాన్ని కూడా సంచలన విషయంగా మార్చడం ఎలాగో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి తెలిసినంతగా మరెవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదేమో?
బీఆర్ఎస్ పార్టీ అధినేత సొంత పార్టీ కార్యాలయానికి వస్తే సంచలనం. మాట్లాడితే సంచలనం. మాట్లాడకపోయినా సంచలనమేనట!
శాసనసభ సమావేశాలకు వచ్చినా, రాకపోయినా సంచలనమే. బహిరంగ సభకు హాజరయితే సంచలనం… ఆ సభలో ఏం మాట్లాడినా సంచలనమే… అని బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నమ్ముతుంది. కానీ ప్రజలు, రాజకీయ ప్రత్యర్ధులు అలా భావిస్తున్నారా?అంటే కాదనే చెప్పాలి.
రెండేళ్ళుగా ఆయన ఫామ్‌హౌసులో ఉండిపోతే ప్రజలు క్రమంగా ఆయనని మరిచిపోయారు తప్ప కేసీఆర్ కోసం ఎవరూ ఆరాటపడలేదు.
ఒకవేళ కేసీఆర్ సోమవారం నిజంగానే శాసనసభ సమావేశాలకు వస్తే ముందుగా రెండేళ్ళుగా జీతం తీసుకుంటూ శాసనసభకు ఎందుకు హాజరు కావడం లేదో మీడియాకు దాని ద్వారా ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాలి కదా?
కానీ కేసీఆర్ శాసనసభకు వస్తే అదే చాలా గొప్ప విషయమన్నట్లు చెప్పుకుంటోంది. “కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గుండె ఆగి చస్తావ్ రేవంత్ రెడ్డి,” అంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన మెసేజ్ ఓ ఉదాహరణ.
కేసీఆర్ పేరుతొ బీఆర్ఎస్ పార్టీ సంచలనాలు, ప్రకంపనాలు సృష్టించాలని ప్రయత్నిస్తుంటే సిఎం రేవంత్ రెడ్డి వారి గాలి తీసేస్తున్నారు.
“కేటీఆర్‌కి బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అప్పగించినా అయన సరిగ్గా నడిపించలేకపోతున్నాడు. కనుకనే కేసీఆర్ గత్యంతరం లేక పార్టీని కాపాడుకునేందుకు ఓపిక లేకపోయినా బయటకు వచ్చారు,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ని చిన్న మాట అంటే మీదపడి కరిచేసినట్లు వ్యవహరించే బీఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా సిఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు!
“కేసీఆర్ ఫామ్‌హౌసులో ఉన్నా జైల్లో ఉన్నట్లే లెక్క. అక్కడా నా పోలీసులే ఉన్నారు. ఇక్కడా నా పోలీసులే ఉన్నారు,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్న మాటలకు బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ సమాధానం ఇవ్వనేలేదు.
కేసీఆర్ విషయంలో సంచలనాలు, ప్రకంపనాలని గొప్పగా అభివర్ణిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితని పార్టీ నుంచి బహిష్కరించడం సంచలనంగా భావించడం లేదు. ఆమె తండ్రి పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, చివరికి తన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం వంటి విషయాలు బయటపెట్టినా అవేవీ బీఆర్ఎస్ పార్టీకి సంచలనంగా అనిపించ లేదు. కనీసం ఆమె ఆరోపనలపి స్పందించే ధైర్యం కూడా లేదు.
కానీ సిఎం రేవంత్ రెడ్డిని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కేటీఆర్ తాజాగా సిఎం రేవంత్ రెడ్డి సతీమణి ప్రస్తావన కూడా చేసి పిచ్చి కుక్కలా మొరుగుతున్న మొగుడ్ని అదుపులో పెట్టుకోమని హితవు పలికారు.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…