
2024 ఎన్నికలు టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలకే కాదు రాష్ట్రానికే కీలకమైనవిగా భావించాలి. ఈ ఎన్నికలలో అధికారంలోకి వచ్చేది కూటమి పార్టీనా, వైసీపీ పార్టీనా అని ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో, అలాగే జూన్ 4 తరువాత ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగేది అమరావతిలోనా..? విశాఖలోనా..? అని కూడా అనే ఆత్రంగా ఎదురుచూస్తున్నారు రాష్ట్ర ప్రజానీకం.
జగన్ చెప్పినట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముడు రాజధానులు వచ్చినట్టే అని చెప్పాలి. కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని స్థాపిస్తే వారు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తారు. అలాకాకుండా తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖను రాజధానిగా ప్రకటిస్తారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తన ఎన్నికల ప్రచారంలో రాజధాని పై అటు అమరావతికి కానీ, ఇటు విశాఖకు కానీ ఎటువంటి మద్దతు తెలపలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఏపీ కి మరో కొత్త రాజధాని అవసరమనేగా.
ప్రభుత్వాలు మారితే ప్రభుత్వ పథకాల పేర్లు మారుతాయని, అధికారులు మారతారని ఊహించిన ప్రజానీకానికి ఇలా రాష్ట్ర రాజధాని కూడా మారుతుందని మొట్టమొదటిసారిగా దేశానికే చాటి చెప్పిన ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పవచ్చు. రాజధాని పేరుతో ప్రాంతాల మధ్య విద్వేశాలు సృష్టించి తమ అధికార పీఠానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి ప్రణాళికలు వేసిన జగన్ కు ఇప్పుడు అదే రాజధాని అంశం తన పీఠాన్ని కదిలించేలా చేసింది.
రాష్ట్రానికి ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు కానీ రాష్ట్రం శాశ్వతం. ఒకరి ఇష్టానికి మార్చుకోవడానికి ‘రాజధాని అనేది ఒక పార్టీ అధ్యక్ష పదవి’ కాదనేది జగన్ గ్రహించలేకపోయారు. తానూ ఎన్నికలలో విజయం సాధిస్తే విశాఖలోనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాను అంటూ జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమరావతిలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రకటించారు.
దీనితో జూన్ 4 తరువాత ఆంధ్రపదేశ్ అమరావతి తో పాటు అభివృద్ధి చెందుతుందా..? లేక విశాఖతో పాటు దోపిడీకి గురవుతుందా అనేది తేలిపోనుంది. ఇలా రెండు పార్టీల మధ్య సమరాన్ని రాష్ట్ర సమస్యగా మార్చి మూడు ముక్కలాటకు శ్రీకారం చుట్టిన జగన్ ఆటకు ఓటింగ్ శాతం చెక్ పడనుందా..?
Anand Deverakonda and Vaishnavi Chaitanya’s Epic is facing brutal trolling after its OTT premiere on…
దేశంలో లక్షలాది ప్రజల ఓట్లు ‘చోరీ’ అయ్యాయంటూ సీజేపీ, కాంగ్రెస్ మిత్రపక్షాల అధ్వర్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు పట్టుబడుతూ…