ప్రస్తుతం ఇదే అనుమానం పవర్ స్టార్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఈ సందేహాలకు తెరలేపింది “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా నిర్మాత శరత్ మరార్ చేసిన ఓ ట్వీట్. ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటోందని, ఇన్ని సంవత్సరాలు తనకు అండగా నిలబడినటువంటి అభిమానులందరికీ పవన్ కళ్యాణ్ ఈ సినిమాను అంకితం చేస్తున్నారని” ఓ ఫోటోను విడుదల చేస్తూ ట్వీట్ చేసారు శరత్ మరార్.
అయితే సహజంగా ఇలాంటి డైలాగులన్నీ చివరి సినిమాకు వస్తుంటాయి. సినిమాల నుండి రిటైర్ అవుతానంటూ ఇటీవల పవన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఇదే చివరి చిత్రంగా పవన్ ఆడియో వేడుకలో ప్రకటిస్తారేమో అన్న ఆందోళన పవన్ అభిమానుల్లో కలుగుతోంది. ఇప్పటికే దాసరి వంటి పలువురి ప్రముఖులకు తమ తమ బ్యానర్లలో సినిమాలు చేస్తానని పవన్ మాట ఇచ్చారు.
రాజకీయ రంగంలోకి ప్రవేశించే దృక్పధంతో ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంటారా? లేక శరత్ మరార్ చెప్పిన మాటలు కేవలం కాకతాళీయంగా వచ్చినవేనా? ఏది ఏమైనా ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ మాత్రం ఏదొక రూపేణా నిరంతరం వార్తల్లో ఉంటూ ప్రచారాన్ని ఆర్జిస్తోంది.





