Telugu

మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?

ఇప్పుడు అమెరికా, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌, ఇరాన్, ఇరాక్‌లో ఏం జరిగితే మాకెందుకు అనుకునే పరిస్థితి లేదు.

ADVERTISEMENT

ప్రపంచంలో ఏ మూల ఏం జరిగిన దాని ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారత్‌తో సహా అన్ని దేశాలపై పడుతూనే ఉంటాయి.

ఉదాహరణకు ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మొదలైంది. దానిలో ట్రంప్‌ గెలిస్తే భారత్‌పై ఒకలాగ కమలాహారిస్ గెలిస్తే మరోలాగా ప్రభావం ఉండవచ్చు.

ఉక్రెయిన్ దేశంపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తే ఉక్రెయిన్లో వైద్య విద్య అభ్యసించడానికి వెళ్ళిన భారతీయ విద్యార్దులను విమానాలు పంపి తెచ్చుకోవలసివచ్చింది.

ఆ యుద్ధం కారణంగా రష్యాపై అగ్రరాజ్యాలు ఆంక్షలు విధించడంతో ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో రష్యా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో కూరుకుపోయి తక్కువ ధరకు ముడిచమురు ఆఫర్ చేసింది. దానిని భారత్‌ కొనుగోలు చేయడంపై మొదట విమర్శలు వచ్చినా, దేశ ప్రయోజనాల దృష్ట్యా అదే సరైన నిర్ణయమని తర్వాత అందరూ అంగీకరించారు.

రష్యా-ఉక్రెయిన్ మద్య యుద్ధం మూడేళ్ళు కావస్తున్నా ఇంకా ముగియకపోగా రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులను పంపిస్తుండటం, తాజాగా ఖండాంతర క్షిపణి ప్రయోగం చేయడంతో అమెరికా అప్రమత్తమైంది.

ఉత్తర కొరియా ఈ యుద్ధంలో ప్రవేశిస్తే అమెరికా కూడా ప్రవేశించడం ఖాయమేనని హెచ్చరిస్తోంది. చాలా దూకుడుగా వ్యవహరించే డొనాల్డ్ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైతే ఈ యుద్ధం ఇంకా విస్తరించినా ఆశ్చర్యం లేదు.

మరోపక్క ఇరాన్, ఇరాక్ కలిసి ఇజ్రాయెల్‌తో యుద్ధం మొదలుపెట్టాయి. ఇజ్రాయెల్‌ పక్కనే ఉన్న పాలస్తీనాతో కూడా యుద్ధం చేస్తూనే ఉంది. ఈ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్‌కి అండగా వస్తోంది. మరోపక్క సిరియాతో అమెరికా వేరేగా మరో యుద్ధం చేస్తోంది.

అమెరికా, ఇజ్రాయెల్‌ ధాటికి ఇరాన్, ఇరాక్, పాలస్తీనా, సిరియా వంటి దేశాలు తట్టుకోలేవు. కనుక వాటికి అండగా కొన్ని గల్ఫ్ దేశాలు ముందుకు రావచ్చు లేదా చాటుగా వాటికి అవసరమైన సహాయసహకారాలు అందించవచ్చు.

భారత్‌కి పక్కలో బల్లెంలా మారిన చైనా సరిహద్దులో తరచూ కవ్విస్తూనే ఉంది. భారత్‌ భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. భారత్‌లో అరుణాచల్ ప్రదేశ్ తమదే అని చైనా ఎప్పటి నుంచో వాదిస్తూనే ఉంది. అలాగే చైనా తన ఆయుధ శక్తి ప్రదరిస్తూ ఫిలిపిన్స్, తైవాన్ దేశాలను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.

భారత్‌ నుంచి జమ్మూ కశ్మీర్‌ని విడదీసేందుకు పాకిస్తాన్ దశాబ్ధాలుగా వేర్పాటువాదులను ప్రోత్సహిస్తూనే ఉంది. ఉగ్రదాదులు చేయిస్తూనే ఉంది.

మొత్తంగా చూస్తే ప్రపంచంలో ప్రధాన దేశాలన్నీ యుద్ధంలోనో లేదా యుద్ధం అంచులలో ఉన్నాయని స్పష్టమవుతుంది. కానీ వీటన్నిటి మద్య భారత్‌ ఒక్కటే శాంతికాముక దేశంగా కనిపిస్తోంది. శాంతి నెలకొల్పేందుకు ప్రధాని నరేంద్రమోడీ కృషి చేస్తున్నారు. కానీ యుద్ధోన్మోదంతో ఇన్ని దేశాలు రగిలిపోతుంటే భారత్‌ శాంతి ప్రవచనాలు ఎవరు వింటారు?

కనుక ప్రపంచంలో వేర్వేరు దేశాలలో జరుగుతున్న ఈ యుద్ధాలన్నీ చివరికి మూడో ప్రపంచయుద్ధానికి దారితీసినా ఆశ్చర్యం లేదు. కనుక భారత్‌ కూడా దాని భయంకర పర్యవసానాలు ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి.

ఒకవేళ మూడో ప్రపంచయుద్ధం జరుగకపోయినా ఎడతెరిపి లేకుండా జరుగుతున్న ఈ యుద్ధాల వలన ముడిచమురు, భారత్‌కు వివిద దిగుమతులు తగ్గిపోయి, శరవేగంగా ధరలు, నిరుద్యోగం పెరిగిపోయే అవకాశం ఉంది.

కనుక భారతీయులు ఆర్భాటాలు, విలాసాలు, అనవసరపు ఖర్చులు మానుకొని మళ్ళీ పొదుపు పాటించడం చాలా మంచిది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

విశాఖ మేయర్ పీఠం.. ఆ జనరల్ మహిళ ఎవరు?

విశాఖ మేయర్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ…

6 minutes ago

After A Big Break, Vallabhaneni Vamsi Is Back?

Andhra Pradesh politics got largely streamlined after the removal of YCP from power. Usually abusive…

41 minutes ago