
తమిళనాడు ఎన్నికల ఫలితాలు, దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకోబోతున్నాయా.? దక్షిణాదిన బీజేపీ కూటమిని అణగదొక్కేందుకు కేసీఆర్ బిఆర్ఎస్, జగన్ వైసీపీ, విజయ్ టీవీకే ఒక్కటి కానున్నాయా.? ఆ దిశగా రాజకీయం ముందుకు తీసుకెళ్లేందుకు ఆ మూడు పార్టీల అధినేతలు ఒకటి కానున్నారా.? మూడు రాష్ట్ర రాజకీయాలలో ను ఇప్పుడీ చర్చ ఊపందుకుంది.
పాన్ ఇండియా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారాలని భావించిన కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను 40 ఏళ్ళ పాటు ఏకచక్రాధిపత్యం గా పాలించాలనే అత్యాశతో వైసీపీ ఉన్న తరుణంలో అక్కడి రాష్ట్ర ప్రజలు ఇరు పార్టీల అధినేతలకు ఊహించని షాక్ ఇచ్చారు.
దీనితో ప్రజలు తమకు, తమ పార్టీలకు ఇచ్చిన రిటర్న్ గిఫ్టులతో ఇద్దరు నేతలు ఒకరు ఫామ్ హౌస్ లో మరొకరు బెంగళూర్ ప్యాలస్ లో సేద తీరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజగా తమిళనాట రాజకీయాలలో సంచలనంగా మారిన విజయ్ టీవీకే విజయం వీరిద్దరికి ఆశ కిరణంగా కనిపిస్తుంది.
వీరిద్దరికి జోడిగా విజయ్ ని కలుపుకుని దక్షిణాదిన ‘రీజినల్’ ఫ్రంట్ ఏర్పాటుకు ఈ మూడు పార్టీలు ప్రణాళికలు వేస్తున్నాయా.? ఆ రీజినల్ ఫ్రంట్ ముఖ్య ఉద్దేశం ‘రెలిజియన్’ ఓట్ బ్యాంకు ను కూడగట్టడమేనా.? అనే అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అయితే విజయ్ కి జగన్ మధ్య ఉన్న కామన్ పాయింట్స్ విషయానికొస్తే, ఇద్దరు సంక్షేమ పథకాలను పెద్ద పీఠ వేస్తున్నారు, ఇద్దరికీ క్రిస్టియన్ ఓట్ బ్యాంకు అదనపు బలం, ఇద్దరు డౌన్ టూ ఎర్త్ లుక్స్ లో కనిపించడం, ఇక్కడ వైసీపీ విజయ్ భజన చెయ్యడం, అక్కడ విజయ్ జగన్ ఫోటో పట్టుకోవడం,
అలాగే ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో హిందూ దేవాలయాల మీద దాడులు, ఇక అక్కడ అధికారంలోకి వచ్చిన విజయ్ టీవీకే నేతలు సనాతన ధర్మ నిర్ములన అంటూ ప్రకటనలు చేయడం..ఇలా ఇద్దరు అధినేతలు ఒకరిని ఒకరు ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది.
ఇక కేటీఆర్, జగన్ విషయానికొస్తే వీరిద్దరికి కామన్ పాయింట్…ఇద్దరికీ టీడీపీ రాజకీయ ప్రత్యర్థి, అలాగే ఇద్దరు బాబు ఓటమి కోసం ఎదురుచూస్తుంటారు, ఇక ఈ ఇద్దరు ఒకరి పార్టీ గెలుపు కోసం మరొకరు తెరచాటు రాజకీయాలు చేస్తూ రిటర్న్ గిఫ్ట్ లు ఇచ్చుకోవడం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే.
బిఆర్ఎస్, వైసీపీ ఓటమితో జగన్, కేటీఆర్ సమాలోచనలు, బెంగుళూర్ కేంద్రంగా కేటీఆర్ జగన్ అధికారిక, అనధికారిక సమావేశాలు, ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వ్యూహాత్మక బంధాన్ని తెలియచేస్తున్నాయి.
అయితే వీటన్నిటి వెనుక ఉన్న ఉమ్మడి లక్ష్యం తమిళనాడులో విజయ్ మాదిరి తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి రావడం, మూడు పార్టీల అధినేతలు కలిసి బీజేపీ కి ఎన్డీయే కూటమి కి వ్యతిరేకంగా కూటమి కట్టడం, తమ బలంతో కేంద్రంలో చక్రం తిప్పడం.
అయితే ఇక్కడ ఇప్పటికే విజయ్ కాంగ్రెస్ తో జట్టు కట్టి తమిళనాట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. కానీ ఇటు తెలంగాణలో బిఆర్ఎస్ కి ఏపీలో వైసీపీ కి కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థి. కేటీఆర్ రేవంత్ సర్కార్ ఓటమి కోసం కంకణం కట్టుకుంటే, జగన్ కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించిన ధీరుడిగా ప్రచారం చేసుకున్నారు. అలాగే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో ఉన్న జగన్ సోదరి షర్మిల వైసీపీ వినాశనం కోసం ఎదురు చూస్తున్నారు.
ఇటువంటి తరుణంలో ఈ మూడు పార్టీల రాజకీయ పొత్తు పొడుచుకునే అవకాశం ఉంటుందా.? ఈ ముగ్గురు నేతలు కలిసి కేంద్రంలో బీజేపీ దూకుడుకి ఏపీలో బాబు స్పీడ్ కి కళ్లెం వేయగలుగుతారా.? వైసీపీ ఈ కూటమితో ఏపీలో టీడీపీ కూటమిని దెబ్బకొట్టగలదా.?
కాంగ్రెస్వ తో కలిసిన విజయ్ తో స్నేహం కేసీఆర్ కి రేవంత్ ను గద్దె దింపేందుకు సాయపడుతుందా.? ప్రాంతీయ పార్టీల కూటమిగా ఎదిగి మతపరమైన రాజకీయాలు కేంద్రంగా రాజకీయాలు చేసి విజయం అందుకోవాలని భావించే వీరి ఆశలు చిగురిస్తాయా.? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరకాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది…!
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…