‘జర్నీ’ సినిమాతో క్రేజీగా మారిన తెలుగు బొమ్మ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అంజలి… తమిళ హీరో జై… వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారనేది పాత వార్త. అధికారికంగా ఈ సెలబ్రిటీలిద్దరూ ఏ విషయమూ ధృవీకరించనప్పటికీ… వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారనే విషయం సినీ జనాలకు మరియు నెటిజన్లకు తెలిసిందే. ఇందుకు నిదర్శనంగా అంజలి పుట్టినరోజు మరో వేదిక అయ్యింది.
సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకు అంజలి పుట్టినరోజు సందర్భంగా తన స్వహస్తాలతో ఓ లేఖ రాస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు జై. “నీ బిగ్ డే నాకు ఎంతో స్పెషల్… ఎందుకంటే నువ్వు నాకు స్పెషల్ కనుక… నీ రాకతో నా జీవితంలో ప్రతిరోజూ స్పెషల్ గా మార్చేసావ్… దేవుడు, నేను ఎన్నడూ నీతోనే ఉంటాం… హ్యాపీ బర్త్ డే అంజూ… నీ జై…” అంటూ రాసిన లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్ కు దూరంగానే ఉన్న అంజలి, తమిళంలో మాత్రం జైతోనే ఒక సినిమా చేస్తోంది. అయితే త్వరలోనే వీరిద్దరూ ఓ ఇంటి వారు కావడం తధ్యం అన్న టాక్ హల్చల్ చేస్తోన్న నేపధ్యంలో… జై రాసిన ఈ లేఖ దానిని మరింత బలపరిచినట్లయ్యింది. ఈ లేఖ ఉద్దేశం జన్మదిన శుభాకాంక్షలు తెలపడమే అయినప్పటికీ, ఇందులో ఎంత ప్రేమ దాగి ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా!



