జూనియర్ ఎన్టీఆర్… ఏంటిది..?

Jai Lava Kusa - JR NTRబాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా “జై లవకుశ” అనే చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కు రెండు రోజుల క్రితమే హరికృష్ణ సైతం వచ్చి వెళ్ళిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తుండగా, సదరు ఫోటోలో విడుదలైన ‘ఎన్.లవకుమార్’ పాత్ర మాత్రం వెనుక నుండి చూడడానికి చాలా నార్మల్ గానే ఉంది.

అయితే ఇందులో ఉన్న మూడు పాత్రలలో ఓ పాత్రలో మాత్రం మునుపెన్నడూ లేని రీతిలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నారని, ఈ పాత్ర సినిమాకే హైలైట్ కాబోతోందన్న ప్రచారం సినిమా మొదలైన నాటి నుండి ఉంది. దీనికి మరింత బలమిచ్చేలా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గెటప్ లో కళ్ళు రెండు పైకి తెరిచి ఉన్న ఈ ఫోటోలు చూడగానే ఒక్కసారిగా షాక్ కు గురి చేస్తున్నాయి, మరో విధంగా చెప్పాలంటే భయపెడుతున్నాయి కూడా!

ADVERTISEMENT

బహుశా అభిమానులను, సినీ ప్రేక్షకులను మానసికంగా ఈ లుక్ కు అలవాటు చేసేందుకే ఈ ఫోటోలు విడుదల చేసారా అన్న సందేహం కలుగుతోంది. నిజంగా ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ ను ఇలా స్క్రీన్ పైన చూస్తే, రియాక్షన్ పాజిటివ్ గా ఉండే అవకాశం ఎంత ఉందో, నెగటివ్ ఉండే అవకాశం అంత కంటే ఎక్కువ. దీంతో ముందుగానే ఈ లుక్ కు సంబంధించి ప్రేక్షకులను మెంటల్ గా ఫిక్స్ చేసేందుకు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వదిలినట్లుగా కనపడుతోంది. మరి ఈ గెటప్ తో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో తెలియాలంటే కొన్నాళ్ళ పాటు వేచిచూడక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories