Jail is The Only Vaccine For YSR Congress Party

గత ఐదేళ్ల వైసీపీ పాపాలు ఆ పార్టీ నేతలను నీడలా వెండాడుతున్నాయి. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ జగన్ ను నమ్మి వైసీపీ అండలో ఆ పార్టీ నేతలు చేసిన అరాచకాలు, అకృత్యాలు ఒక్కొక్కటి న్యాయస్థానాల ముందుకొస్తున్నాయి.

ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ ఎలా అయితే ఆరోగ్యానికి, సమాజానికి హానికరమే అలాగే ఏపీకి వైసీపీ కూడా అలానే హానికరం అనేలా ఆంధ్ర రాష్ట్ర పరువుని, ఏపీ భవిష్యత్ ను “వైసీపీ అనే వైరస్” తో కుప్పకూల్చారు వైస్ జగన్.

Also Read – జగన్‌ మోడల్ బెస్ట్ అంటున్న రేవంత్ రెడ్డి!

ఈ వైరస్ తాలూకా లక్షణాలు….బూతులు తిట్టడం, ఆడవారిని అగౌరవపరచడం, హత్యలు చేయడం, వాటిని డోర్ డెలివరీ చేసి బాధితులకు అందించడం, అలాగే వారి కన్నీటితో రాక్షస ఆనందం పొందడం, కంటికి కనిపించిన భూములను స్వాహా చెయ్యడం, చేతికి అందినంత దోచుకోవడం, దౌర్జన్యాలకు తెగబడడం, రౌడీ ఇజం తో రెచ్చిపోవడం.

కులాల మధ్య చిచ్చులు పెట్టడం, మతాల మధ్య మంట రేపడం, చావుల దగ్గరకెళ్ళి షిక్కటి చిరు నవ్వులు చిందించడం, అడ్డుకుంటే దాడులు, ప్రశ్నిస్తే కేసులు..ఇలా ఈ వైసీపీ వైరస్ వేరియెంట్ కు అనేక అవలక్షణాలతో ఏపీ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసింది. అయితే ఈ వైరస్ కి ‘ఓటమి’ అనే వాక్సిన్ వేసి ప్రజలు తమవంతు బాధ్యత పూర్తి చేసారు.

Also Read – అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం.. భేష్!

అలాగే, ఇక పై ఆ వైరస్ మరోసారి రాష్ట్రం మీద దండయాత్ర చేయకుండా అణచివేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దీనితో ఇక ఈ వైసీపీ వైరస్ కు శాశ్వత వాక్సిన్ ను సిద్ధం చేసే పనిలో పడ్డ కూటమి ప్రభుత్వం అందుకుగాను దీనికి జైలే సరైన వాక్సిన్ అని తేల్చింది.

ఈ నేపథ్యంలో భాగంగా గత ఐదేళ్లు ఈ వైరస్ లక్షణాలతో ఏపీ సమాజాన్ని పూర్తిగా కలుషితం చేసిన వారిని, ఈ వైరస్ తో బాధపడుతున్న నేతలను ఒక్కొక్కరిని గుర్తించి వాక్సిన్ తెరపీకి పంపుతుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగానే వర్రా రవీంద్ర రెడ్డి, నందిగామ సురేష్, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, వల్లభనేని వంశీ వంటి నేతలను జైళ్లకు పంపింది.

Also Read – అవినీతిని సెల్ఫ్ సర్టిఫై చేసుకుంటున్నారుగా!

అయితే ఇందులో కొంతమంది కి వాక్సిన్ నుండి విముక్తి రావడంతో ఇక బయట ఉన్న మరికొంతమంది వైరస్ బాధితుల కోసం ప్రభుత్వం వేట మొదలు పెట్టింది. ఇందులో ముఖ్యంగా కొడాలి నాని, రోజా, పేర్ని నాని, అంబటి, దేవినేని అవినాష్, జోగి రమేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.




అయితే వీరికి కూడా కూటమి ప్రభుత్వం వాక్సిన్ వేస్తె కానీ సమాజానికి పట్టిన పీడ, ఏపీకి పట్టిన దరిద్రం పోదు అంటున్నారు ప్రజాస్వామ్య వైద్యులు. మరి కూటమి ప్రభుత్వం వైసీపీ వైరస్ తొక్కిన ప్రతి ఒకరికి వాక్సిన్ వేస్తుందా.? లేక టీకాలతో సరిపెడుతుందా అనేది వేచి చూడాలి.