సోమవారం సాయంత్రం సీయం విజయ్ అనే నినాదాలతో చెన్నై మొత్తం దద్దరిల్లిపోయింది. అయితే.. ఆ ఆనందం కనీసం శుక్రవారం దాకా కూడా నిలబడలేదు. ఇప్పుడు విజయ్ అసలు గవర్నమెంట్ ఫామ్ చేస్తుందో లేదో అనే క్లారిటీ కూడా లేదు. ఏ పార్టీ సపోర్ట్ చేస్తుంది? ఏ పార్టీ హ్యాండ్ ఇస్తుంది? అనే క్లారిటీ లేకపోవడంతో విజయ్ మొదలుకొని అతని ఫ్యాన్స్ దాకా అందరూ డీలాపడ్డారు.
ఇప్పుడు విజయ్ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తాడా అనేదానితో పాటుగా “జన నాయగన్” పరిస్థితి ఏంటి? అనే టెన్షన్ కూడా మొదలైంది. ఎందుకంటే.. ఒకవేళ విజయ్ గవర్నమెంట్ ఫార్మ్ చేయలేకపోతే.. “జన నాయగన్”కి మళ్లీ సెన్సార్ సమస్యలు తలెత్తడం ఖాయం. సెన్సార్ కంటే కూడా విజయ్ ఫ్యాన్స్ ప్లాన్ చేసుకున్నట్లుగా థియేటర్లలో ఎంజాయ్ చేయలేరు.
ఎలా చూసుకున్నా.. విజయ్ ఫ్యాన్స్ కి ఈ ఎలక్షన్స్ ఆనందం కంటే ఎక్కువ టెన్షన్ మిగిలిచ్చాయి. తమ హీరో 108 సీట్లు గెలుచుకున్నందుకు ఆనందపడాలో? ఆ 10 సీట్లు లేక ప్రభుత్వం ఫార్మ్ చేయడానికి వీలు లేక, గవర్నర్ దగ్గర మెజారిటీ నిరూపించుకోలేక నానా ఇబ్బందులుపడుతుండటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఒకవేళ ఊహాగానాలు నిజమై.. అపోజిషన్ పార్టీలు రెండు గనుక కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. విజయ్ కి జనాల్లో సింపతీ పెరిగినా, ఆ సింపతీ వచ్చే ఎలక్షన్స్ వరకు ఉంటుందా అనేది మెయిన్ పాయింట్. అసలే సినిమాలు చేయను అన్నాడు కాబట్టి, అప్పటివరకు విజయ్ స్టార్ డమ్ & క్రేజ్ ఎలా సస్టైన్ అవుతుంది అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశం. ఈ కన్ఫ్యూజన్ లో జన నాయగన్ రిలీజ్ ఉంటుందా? ఉండదా? అనే ప్రశ్న ఫ్యాన్స్ ని ఇంకాస్త ఎక్కువగా హర్ట్ చేస్తుంది.
అన్నిటికీ మించి ఈ సినిమాకి ముఖ్యమంత్రి విజయ్ అనే టైటిల్ కార్డ్ పడుతుందా లేదా అనే విషయంలోనూ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.




