గడిచిన వారం రోజులుగా తన నోటికి ఇష్టం వచ్చినట్లుగా ప్రసంగాలు చేస్తోన్న జనసేన అధినేత, మహాత్మా గాంధీ పుట్టినరోజుకు వచ్చేసరికి మాత్రం, ఆయన సిద్ధాంతాలనే జనసేన పాటిస్తోందని, ఆయన భావాలే తనకు ఆదర్శమని హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు, గాంధీ వ్యక్తిత్వంలో కనీసం లక్షో వంతైనా ఇతర నాయకులకు ఇవ్వమని పవన్ వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు.
[m9ad]
బహుశా తనకు తాను మరో గాంధీ అనుకుంటున్నారో ఏమో గానీ, నీతులు మాత్రం బూతులు లేకుండా (గాంధీ జయంతి కదా, తిట్ల పురాణానికి బ్రేక్ ఇచ్చారేమో!) బాగానే చెప్పుకొచ్చారు. తన జీవితకాలంలో తిట్ల దండకాన్ని, రెచ్చగొట్టే విధానాన్ని, అసంబద్ధపు, అనుచిత వ్యాఖ్యలు చేయడం గానీ చేయని గాంధీ భావాలను జనసేన సిద్ధాంతాలుగా పేర్కొనడం అనేది, తన స్వార్ధ రాజకీయ ప్రయోజనానికి ఆఖరికి గాంధీని కూడా పవన్ ఎలా వినియోగించుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు.
పవన్ రాజకీయాల్లోకి రాకముందు వరకు ఇలాంటి నీతి వ్యాఖ్యలు సినీ వేడుకల మీద చెప్తే గొప్పగా భావించిన ప్రజానీకానికి, ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ అంటే ఏమిటో రుచిచూపిస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో ఉన్న స్వార్ధ, అవినీతి, అవకాశపు రాజకీయ నాయకుడికి తాను ఏ మాత్రం తీసిపోనని రోజురోజుకు నిరూపించుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ నీతి కబుర్లన్నీ వినేందుకే మేమున్నది అనుకోవడం ప్రజల వంతవుతోంది.



