జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తరువాత తిరిగి సినిమాల్లోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన కమ్ బ్యాక్ ఫిలిం, పింక్ రీమేక్ షూటింగ్ ఇటీవలే మొదలు పెట్టారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమా ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది.
ఇది ఒక పీరియడ్ సినిమా అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పీరియడ్ సినిమా చెయ్యడం ఇదే మొదటి సారి. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు ఇద్దరు బాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకున్నట్టు సమాచారం. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఒక హీరోయిన్ గా, అర్జున్ రాంపాల్ విలన్ గా ఫైనల్ అయినట్టు సమాచారం.
అయితే ఈ సెలక్షన్ కాస్త డిఫరెంట్ గానే ఉంది. పవన్ కళ్యాణ్ కి ఇప్పటివరకూ బాలీవుడ్ మార్కెట్ లేదు. ప్రత్యేకించి ఇద్దరు బాలీవుడ్ నటులను తీసుకుంటున్నారు అంటే ఈ సినిమా ను పాన్-ఇండియా లెవెల్ లో విడుదల చేసే అవకాశం ఉందా అనే సందేహాలు మొదలవుతున్నాయి.
పీరియడ్ సినిమాలకు భాషా బేధాలు ఉండవు అనే అంచనా కావొచ్చు. అయితే మొన్న ఈ మధ్య చిరంజీవి సైరాతో అటువంటి ప్రయత్నమే చేసి దెబ్బ తిన్నారు. కాబట్టి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఒకింత జాగ్రత్త గా ఉండాల్సి ఉంది. మరోవైపు… మొదట్లో 2021 సంక్రాంతికి విడుదల చెయ్యాలని అనుకున్నా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి రానుండడంతో ఏం చెయ్యబోతున్నారు అనేది చూడాలి.






