Telugu

ఏపీ ఎన్నికలలో…పవన్ కళ్యాణ్ vs పవన్ కళ్యాణ్.!

గెలుపు కోసం, అధికారం కోసం, పదవుల కోసం ఎంతటికైనా తెగించడానికి, దిగజారడానికి రాజకీయ పార్టీలు సిద్దపడతాయనేది మరోసారి రుజువయ్యింది. ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికి ఎత్తులతో, పొత్తులతో ముందుకెళ్లడం రాజకీయ పార్టీలకు కొత్తేమి కాదు. దానిని ఎవరు తప్పుపట్టారు.

కానీ పైకి గంభీరంగా నటిస్తూ లోలోపల భయపడే వారి ఎత్తులు రాజకీయ విలువలకు నీళ్ళొదిలేసినట్లు గానే కనిపిస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే జరగబోతుంది. జాతీయ జనసేన పార్టీగా నామకరణం చేసుకుని, పార్టీ అధ్యక్షుడిగా కూడా కె.పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉండడం, ఆ పార్టీకి జనసేన పార్టీ గుర్తైనా గాజు గ్లాస్ ను పోలి ఉండేలా బక్కెట్ గుర్తు కేటాయించడం చూస్తుంటే ఈ పార్టీ పుట్టుక వెనుక రాజకీయంగా తల పండిన పెద్ద తలకాయలే ఉన్నట్లు అర్ధమవుతుంది.

ADVERTISEMENT

అయితే ఇదే పార్టీ తెలంగాణ ఎన్నికలలో కూడా పోటీ చేయడం యాదృచ్ఛికం కాదని పక్కా ప్లాన్ ప్రకారమే ఎన్నికల వ్యూహంలో భాగంగానే కోనింటి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా జాతీయ జనసేన ఏర్పాటు జరిగిందంటూ జనసైనికులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ కుట్రలో భాగమే ఈ జాతీయ జనసేన అనే విమర్శ సోషల్ మీడియాలో గట్టిగా వినపడుతుంది. అయితే తెలంగాణలో ఈ పార్టీ పోటీ వలన జనసేనకు జరిగే నష్టం అంటూ ఏమి ఉండదు.

తెలంగాణ లో జనసేన పార్టీ తన ఉనికిని కూడా ఏర్పాటు చేయలేదు కాబట్టి ఓట్లు చీలినా జనసేన మీద పెద్దగా ప్రభావం ఉండదు.కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు. ఏపీలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన ప్రాభల్యం వినూత్నంగా పెరిగింది. అలాగే కృష్ణా, గుంటూరు, విశాఖలో ప్రత్యర్థుల గెలుపోటములను నిర్ణయించే స్థాయికి జనసేన ప్రభావం ఉంటుంది.

అలాగే ఇప్పుడు జనసేన కు అదనంగా టీడీపీ బలం కూడా చేరడంతో జనసేన గుర్తు పై పడే ప్రతి ఓటు, చీలే ప్రతి ఓటు టీడీపీ- జనసేనలకు ఎంతో కీలకంగా మారబోతుంది.”పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి తనను ఎవరు చూడలేదని” అపోహ పడినట్లుగా జనసేనను దెబ్బ కొట్టడం వలన లాభపడేది ఎవరో అందరికి తెలిసినా వారు తమకి ఈ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని కొట్టిపారేస్తే నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉండరనేది సదరు పార్టీ నేతలు గ్రహించాలి.

175 కి 175 , సింహం సింగల్ అంటూ మేకపోతు గాంభీర్యాలు వలక పోస్తున్న అధికార పార్టీ సింగల్ గా కాదు లోపాయికారి ఒప్పందాలతో చాలామందితో మింగిల్ అయ్యి ఎన్నికలబరిలో నిలుస్తుంది అంటూ విమర్శలు మొదలుపెట్టారు జనసైనికులు. ఏర్పాటైన కొత్త పార్టీ పేరు, పార్టీ గుర్తు చివరికి అధ్యక్షుడి పేరు కూడా మ్యాచ్ అయ్యేలా బాగానే సెట్ చేశారు కానీ మీరు ఆశించింది మాత్రం జరగదు, జరగనివ్వవము అంటూ హెచ్చరిస్తున్నారు పవన్ అభిమానులు.

మొత్తానికి ఏపీ ఎన్నికలలో జనసేన vs జాతీయ జనసేన, గాజు గ్లాస్ vs బక్కెట్, “కొణిదల vs కోనింటి”, పవన్ కళ్యాణ్ vs పవన్ కళ్యాణ్ తలపడడం ఖాయంగా కనపడుతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

CJP Protest: Bollywood Star Detained, His Smile Triggers

The protest of the Cockroach Janata Party, also called CJP, against Chief Election Commissioner Gyanesh…

18 minutes ago

విపక్షాల విమర్శలకు వెంకయ్య సూటి ప్రశ్న…

బీజేపీ ఓట్ చోరీ అంటూ, సర్ ప్రక్రియ అప్రజాస్వామ్యం అంటూ ఇటు బీజేపీ పై అటు సీఈసీ జ్ఞానేశ కుమార్…

38 minutes ago