‘జనతా గ్యారేజ్’లు కొలువు తీరుతున్నాయి!

Janatha Garage, Janatha Garage Craze, Janatha Garage NTR, Janatha Garage Movie, Janatha Garage Updates, Janatha Garage Movie Shooting, Janatha Garage Fans‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ కున్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. చిన్న వయసులోనే హై రేంజ్ మాస్ ఆడియన్స్ ఆదరణ పొందిన హీరోగా జూనియర్ నిలిచారు. అయితే ఒక్కసారి వచ్చిన ఆ ‘మాస్’ స్టార్ డం తర్వాత కాలంలో జూనియర్ కే మైనస్ అయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న ‘బుడ్డోడు,’ ఇటీవల క్లాస్ బాట పట్టారు. అయితే తాజాగా ‘జనతా గ్యారేజ్’ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులకు తన మాస్ రేంజ్ ఏంటో చూపించడానికి జూనియర్ సిద్ధమవుతున్నారు.

‘జనతా గ్యారేజ్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ మెకానిక్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో మెకానిక్ లుగా ఉన్న జూనియర్ అభిమానులు తమ షెడ్ల పేర్లను ‘జనతా గ్యారేజ్’లుగా మార్చుకుంటున్నారు. తాజాగా అలాంటి షెడ్లలో ఒకటైన ‘జనతా గ్యారేజ్’ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. జూలై 6వ తేదీన ‘ఈద్’ సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల కానున్న నేపధ్యంలో ఇలాంటి ఫోటోలు అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories