Telugu

ఆర్జీవీకి పవన్ …. జానీ మాస్టర్ కు జగన్..!

ఎన్నికలు దగ్గర పడడంతో రాజకీయాల మీద ఆసక్తి ఉన్న సినీ సెలబ్రేటిస్ ఒక్కసారిగా రాజకీయాల మీద తమ స్పందన తెలియ చేస్తుంటారు. అది పార్టీ మీద ఉన్న ప్రేమతోనో లేక నాయకుడి మీద ఉన్న అభిమానంతోను ఒక్కొక్కరు ఒక్కోరకంగా తమ మద్దతు తెలుపుతుంటారు.

తాజాగా అటు తెలుగు ఇటు తమిళ సూపర్ స్టార్స్ కు డాన్స్ మాస్టర్ గా పనిచేస్తున్న జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన ఇచ్చిన కౌంటర్ వైసీపీ అధినేత జగన్ కా..లేక ఆయన పెగ్గు పుత్రుడు ఆర్జీవికా…అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు జనసైనికులు. కొన్ని రోజులనుండి ఏపీలో జరుగుతున్న అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలపడానికి వచ్చిన జానీ మాస్టర్ ని తమ ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టాలని భావించిన మీడియా వారికి ఊహించని జవాబు దొరికింది.

ADVERTISEMENT

అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు తనకి తెలుసనీ, చాల చిన్న కుటుంబం నుండి సినీ ఇండస్ట్రీకి రావడం వలన ఇటువంటు వారి కష్టాలు అర్ధం చేసుకోగలనని, వారి నిరసనలో న్యాయం ఉందంటూ వారి నిరసనలకు తానూ మద్దతిస్తున్నట్లు తెలియచేసారు జానీ మాస్టర్. అయితే మీరు ఏపార్టీ తరుపున ఇక్కడికి వచ్చారు? రాబోయే ఎన్నికలలో ఎవరి నాయకత్వంలో పని చేయడానికి సిద్ధపడ్డారు, మీకు జగన్ అంటే ఇష్టమని జనసేన తరుపున మాట్లాడుతున్నారా? వంటి మీడియా ప్రశ్నలకు ఇలా బదులిచ్చారు.

రాజకీయాలలో ఏపార్టీకి మద్దతిస్తున్నాను, ఏపార్టీ తరుపున నిలబడతాను అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం చెపుతాను అంటూ మాటదాటేసారు. మీకు జగన్ ఇష్టం…కానీ పవన్ కు మద్దతా.?అనే ప్రశ్నకు మాత్రం జగన్ మద్దతుదారులకు గట్టి కౌంటర్ వేశారు జానీ మాస్టర్. “ఆర్జీవీకి పవన్ అంటే ఎంత ఇష్టమో జానీ మాస్టర్ కు జగన్ అంటే అంత ఇష్టం” అంటూ వ్యాఖ్యనించడంతో జానీ మాస్టర్ పై గుర్రుగా ఉన్నారు జగన్ అభిమానులు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

After A Big Break, Vallabhaneni Vamsi Is Back?

Andhra Pradesh politics got largely streamlined after the removal of YCP from power. Usually abusive…

33 minutes ago

నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నా రాజకీయాలతోనే కాలక్షేపం!

ట్రంప్ నిర్ణయాలు, ఇరాన్‌ యుద్ధ పరిణామాలు, హెచ్‌1బీ వీసాలు, గ్రీన్ కార్డుల జారీపై కొత్త ఆంక్షలు.. వీటన్నింటి ప్రభావం అమెరికాతో…

44 minutes ago