“1 నేనొక్కడినే” సినిమాకు ఆద్యం పోసిన “ట్రైలర్” టాక్!

JASON BOURNE trailer talkసుకుమార్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన “1 నేనొక్కడినే” సినిమాను అభిమానించే సినీ ప్రియులకు కొదవలేదు. అయితే ఆ సినిమా ఆద్యం పోసింది హాలీవుడ్ మూవీ అయినటువంటి “బోర్న్ ఐడేంటిటీ” అన్న విషయం తెలిసిందే. ఆ సిరీస్ లో వచ్చిన ప్రతి సినిమా సినీ ప్రేక్షకుల ఆదరణకు గురవ్వడంతో, తాజా సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

“జాసన్ బోర్న్” పేరుతో జులై 29వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ ను చిత్ర నిర్మాణ సంస్థ యూనివర్సల్ పిక్చర్స్ విడుదల చేసింది. సాధారణంగా ఈ సినిమా సిరీస్ లలో హీరోకు గతం గుర్తు ఉండదు. కానీ, తాజా సినిమాలో “నేనేంటో నాకు తెలుసు, నాకు అంతా గుర్తుంది” అంటూ హీరో చెప్పే డైలాగ్ లతో పాటు యాక్షన్ దృశ్యాలు సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. 30 సెకన్ల పాటు సందడి చేస్తున్న ఈ ట్రైలర్ వీక్షకుల కోసం….

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories