ఆంధ్రకు జాకీ ఇన్నెర్స్

Jockey Underwear Industry to Anantapurఆంధ్రప్రదేశ్ మరో భారీ పరిశ్రమను ఆకట్టుకుంది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఉన్న జాకీ ఇన్నెర్స్ ను అనంతపురం రప్పించగల్గింది. పరిటాల సునీత సొంత నియోజకవర్గం రాప్తాడులో ఈ యూనిట్ రానున్నది. 2018 అక్టోబర్ లో ఈ యూనిట్ తన ఆపరేషన్స్ ను మొదలు పెడుతుంది. ప్రారంభ దశలో 3000 మందికి ఉపాధి కలిపిస్తుంది.

ADVERTISEMENT

మరో 3000 మందికి దశల వారీగా ఉపాధి కలగనుంది. ఆంధ్రకు రప్పించడానికి గాను ఈ సంస్థకు చాలానే ప్రోత్సాహకాలు ఇచ్చింది గవర్నమెంట్. ఏడాదికి 32. మిల్లియన్ ఇన్నెర్స్ రాప్తాడు కొత్త పరిశ్రమలో తయారు కానున్నాయి. రాప్తాడులో 30 ఎకరాల స్థలం ఎకరాకు 10 లక్షలకే ఇవ్వడానికి సిద్ధం అయ్యింది చంద్రబాబు ప్రభుత్వం.

అనంతపురం జిల్లాలో ఇప్పటికే కియా మోటార్స్ వచ్చింది. దీనితో కరువు జిల్లాకు మంచి రోజులు రానున్నాయి. త్వరలోనే బెంగళూరుకు వలస వెళ్లే రోజులు పోయి ఉన్న చోటనే ఉపాధి కలిగే అవకాశం వస్తుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2019లో ఖచ్చితంగా ఇది తెలుగు దేశానికీ కలిసొచ్చే అంశమే.

ADVERTISEMENT
Latest Stories