బావ కళ్ళలో ఆనందం కోసం ఎన్టీఆర్ మహేష్ కు హ్యాండిచ్చాడా?

Jr-NTR-The-Favourite-Topic-of-Outgoing-TDP--Leadersసంక్రాంతి బరిలోని రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఇప్పుడు సంక్రాంతి అగ్ర సింహాసనం ఎవరికీ అనేది తేలాల్సి ఉంది. ఈ దశలో రెండు వైపులా వారు ప్రమోషన్స్ వేడి పెంచారు. తమదే పెద్ద హిట్ అంటే తమదే పెద్ద హిట్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ అల వైకుంఠపురంలో సైడ్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది.

అల వైకుంఠపురంలో సినిమా హిటైన సందర్భంగా చిత్ర బృందాన్ని ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. బన్నీ యాక్టింగ్ ని, త్రివిక్రమ్ డైరెక్షన్ ని, మురళి శర్మ పెర్ఫార్మెన్స్ ని, పీఎస్ వినోద్ కెమెరా వర్క్ ని, థమన్ సంగీతాన్ని, హారిక హాసిని నిర్మాణ విలువలను పొగుడుతూ ట్వీట్ పెట్టాడు ఎన్టీఆర్.

ADVERTISEMENT

బన్నీని బావ అని, త్రివిక్రమ్ ని స్వామి అని ఈ సందర్భంగా ఎన్టీఆర్ సంబోధించడం విశేషం. అయితే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ గురించి ఎన్టీఆర్ ఇప్పటివరకు ట్వీట్ చెయ్యకపోవడం విశేషం. గతంలో మహేష్ బాబు భారత్ అనే నేను సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఏమైందో తెలియదు.

అయితే ఇలా పోటీలో ఎన్టీఆర్ వన్ సైడ్ తీసుకునే అవకాశం లేదని, ఈరోజో రేపో సరిలేరు నీకెవ్వరూ గురించి కూడా ట్వీట్ వేస్తారని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనితో ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఇలా ఉండగా ఈ రెండు సినిమాల మీద దాదాపుగా 200 కోట్ల బిజినెస్ జరిగింది.

ADVERTISEMENT
Latest Stories