ఎన్టీఆర్ 100 కోట్లు కొట్టడం ఖాయమా?

jr ntr aravindha sametha 100 crores collectionsయంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. మొదటి ఆటల నుండి సినిమా గురించి పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పటివరకు భారీగా వసూళ్ళు రాబడుతుంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ చిత్రాలలో 100 కోట్ల షేర్ సాధించిన చిత్రం లేదు. ఈ చిత్రం అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

[m9ad]

ADVERTISEMENT

తన మునుపటి చిత్రం, అజ్ఞతవాసి తీవ్రంగా నిరాశపరచడంతో ఈ చిత్రంపై దర్శకుడు త్రివిక్రమ్ భారీ ఆశలే పెట్టుకున్నారు. మరోవైపు ఈ చిత్రం హీరోయిన్ పూజా హెగ్డే కు ఇప్పటివరకు సరైన హిట్టు లేదు. పలు స్టార్ హీరోల చిత్రాలతో ఆమె బిజీగా ఉన్నా ఆ లోటు మాత్రం అలాగే ఉంది. ఈ సినిమా 100 కోట్ల షేర్ సాధిస్తే అందరూ హ్యాప్పీస్.

అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్‌ తరువాత కూడా మాటల మాంత్రికుడిని నమ్మి అవకాశం ఇచ్చాడు. త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ తనపై పెట్టిన నమ్మకాన్ని బానే నిలబెట్టుకున్నాడనే చెప్పుకోవాలి. ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో మరో వారం పది రోజులు బాక్స్ ఆఫీసు పై ఎన్టీఆర్ దండయాత్ర ఖాయంగా కనిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories