‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానులను, ప్రేక్షకులను చూసిన సమయంలో… భావోద్వేగానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రిని తలచుకుంటూ కన్నీటి పర్యంతం అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ కు యంగ్ టైగర్ రాగలరా? లేరా? అన్న సందేహం వ్యక్తమైన తరుణంలో… వాటన్నింటిని పటాపంచలు చేస్తూ దూసుకుపోతున్నాడు తారక్.
[m9ad]
ఇప్పటికే రేడియో ఇంటర్వ్యూలను ముగించిన జూనియర్, తాజాగా ప్రింట్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో వెబ్ అండ్ న్యూస్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నారు. ఇలా ఆది, సోమవారాల వరకు ప్రమోషన్ కార్యక్రమాలతో యంగ్ టైగర్ బిజీబిజీగా గడపనున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలలో తారక్ భాగస్వామి కావడం చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
మరో పక్కన “అరవింద సమేత” గ్రాండ్ ఎంట్రీ కోసం టాలీవుడ్ బాక్సాఫీస్ కూడా ఎదురుచూస్తోంది. “గీత గోవిందం” తర్వాత తెలుగు ప్రేక్షకులకు సరైన సినిమా పడకపోవడంతో, త్రివిక్రమ్ – తారక్ ల “అరవింద సమేత”పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా పండగ సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా ఓపెనింగ్స్ సెన్సేషన్ గా నిలుస్తాయన్న టాక్ ట్రేడ్ పండితులలో వ్యక్తమవుతోంది.



