మెగా అండ్ నందమూరి “ఫ్యామిలీ” కాంబో!

Jr-NTR-Balakrishna-Kalyan-ram-at--Aravinda-Samethaటాలీవుడ్ పిల్లర్స్ మూలస్తంభాలైన మెగా అండ్ నందమూరి ఫ్యామిలీలలో ఒకేసారి “బాబాయ్ & అబ్బాయ్” కాంబోలు హాట్ టాపిక్ కావడం విశేషం. తిత్లీ బాధితులను పరామర్శించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్ళడం… ఏదైనా ఓ గ్రామాన్ని రామ్ చరణ్ దత్తత తీసుకోవాలని కోరతానని చెప్పడం… కట్ చేస్తే, బాబాయ్ ఆజ్ఞను శిరసా వహిస్తానని రామ్ చరణ్ చెప్పడం… అంతా వడివడిగా జరిగిపోయింది.

[m9ad]

ADVERTISEMENT

దీంతో ఈ “బాబాయ్ – అబ్బాయ్’ కాంబో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలకు మెగా అభిమానులను ఏకతాటిపైకి తీసుకువచ్చే ఈ ప్రక్రియ జనసేనకు కాస్తో కూస్తో కలిసి వచ్చే అంశమే. రాజకీయాలను పక్కన పెడితే, మరికొద్దిసేపట్లోనే మరో ‘బాబాయ్ – అబ్బాయ్’ కాంబోకు శిల్పకళావేదికలో తెరలేపనున్నారు. అయితే ఈ సారి నందమూరి ఫ్యామిలీ వంతు!

‘అరవింద సమేత’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ నందమూరి నటసింహం బాలకృష్ణ విచ్చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో నందమూరి అభిమానులంతా ఈ ‘బాబాయ్ – అబ్బాయ్’ కాంబోను ప్రత్యక్షంగా చూసేందుకు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ఒకేసారి ఇలా మెగా అండ్ నందమూరి ఫ్యామిలీలలో ‘బాబాయ్ – అబ్బాయ్’ కాంబో వర్కౌట్ కావడం కాకతాళీయమేనా? లేక రాజకీయ కోణం దాగి ఉందా?! ఏది ఏమైనా ఫ్యాన్స్ కు పండగేగా!

ADVERTISEMENT
Latest Stories