పబ్లిసిటీ కోసం…వర్మ అవన్నీ చూపిస్తాడా?

Jr NTR - Lakshmis NTRఒక పక్క “ఎన్టీఆర్” బయోపిక్ అంటూ బాలకృష్ణ ఆయన సినీ జీవితాన్ని…మరో పక్క ఆయన రాజకీయ ప్రభంజనాన్ని తెరకెక్కిస్తూ ఉంటే…ఇంకో పక్క పని లేని వాడు పిల్లి తల గొరిగినట్లు వర్మ కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ విషయాలు అన్నీ పాతవే అయినా…కాస్త కొత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే..

[m9ad]

ADVERTISEMENT

ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉంటాయేమో అన్న అనుమానంతో ఉన్నాయి సినిమా వర్గాలు. ముఖ్యంగా ఎన్టీఆర్ చేతుల్లో నుంచి చంద్రబాబు పార్టీని తనవైపు తిప్పుకున్న వ్యవహారం..లక్ష్మీ పార్వతి ప్రకారం మరో పక్క ఎన్టీఆర్ కి జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలినీని, జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మి పార్వతే పరిచయం చేసింది విషయం, అంత చేసినా జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ఫోటోలను బయటకు పాడేశాడు అన్న విషయం, మరో పక్క ఎన్టీఆర్ కుటుంభం లక్ష్మీ పార్వతిని ఇబ్బందులు పెట్టారు అని ఆమె చేసిన విమర్శలు..ఎన్టీఆర్ చైతన్య రధంపై దాడి సన్నివేశాలు..ఎన్టీఆర్ ఇంకో అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వర రావు పాత్ర…

ఇలా ఎన్నో కాంట్రోవెర్షియల్ విషయాలను వర్మ టచ్ చేస్తాడో లేదో? ఒక వేళ టచ్ చేసినా నిజాలు తీస్తాడో, లేక ఏవైనా కల్పితాలను సృష్టిస్తాడో…తెలీదు కానీ…మొత్తంగా చూసుకుంటే మాత్రం కాంట్రొవర్సీస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ లాంటి వర్మ ఈ సన్నివేశాలు ఏమీ లేకుండా సినిమా తీస్తాడు అని మాత్రం ఎవ్వరూ అనుకోరు. మరి వర్మ మైండ్ సెట్ ఎలా ఉందో చూడాలి అంటే మాత్రం ఆ సినిమా పూర్తి అవ్వాలి…విడుదల కావాలి!

ADVERTISEMENT
Latest Stories