nandamuri-mokshagna-jr-ntr

ఎప్పుడెప్పుడా అంటూ నందమూరి అభిమనులు ఆశగా ఎదురు చూస్తున్న బాలకృష్ణ తనయుడి సినీ అరంగేట్రం కు మోక్షజ్ఞ పుట్టిన రోజు వేదికయ్యింది. హనుమాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రాబోతున్న నెక్స్ట్ మూవీతో మోక్ష టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దమయ్యింది.

మోక్ష పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ చెపుతూ “సింబ ఈజ్ కమింగ్” అంటూ మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే ఎక్కువగా మాస్ ఇమేజ్ లో కనిపించే నందమూరి హీరోలకు భిన్నంగా ఒక క్లాస్, స్టయిలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు మోక్ష.

Also Read – విశ్వంభర VFX ఎక్కడ తేడా కొట్టింది?

హనుమాన్ తో చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ టాలీవుడ్ సెన్సేషన్ అయ్యారు. దానికి తోడు ఇప్పుడు ఏకంగా బాలకృష్ణ తనయుడిని వెండి తెర కు పరిచయం చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు.

ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చూపిస్తే ఇక అగ్ర దర్శకులలో ఒకరిగా మారిపోతారు ప్రశాంత్. అయితే మోక్ష టాలీవుడ్ ఎంట్రీతో నందమూరి వారసులు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేసారు.

Also Read – సొంత మీడియాలో డప్పు కొట్టుకుంటే చాలా?

జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ నటనలో నువ్వు తాత గారిలా మంచి పేరు తెచ్చుకోవాలి, ఆయన ఆశీస్సులు నీకు ఎప్పటికి ఉంటాయి అంటూ టాలీవుడ్ ఎంట్రీకి నీకు అభినందనలు, పుట్టిన రోజు శుభాకాంక్షలు మోక్ష అంటూ తన X వేదికగా మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ట్వీట్ చేసారు తారక్.




అలాగే తాత గారి ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ కళ్యాణ్ రామ్ కూడా మోక్ష కు తన శుభాకాంక్షలు తెలియచేసారు. దీనితో నందమూరి కుటుంబం నుండి టాలీవుడ్ కు మరో స్టార్ హీరో రెడీ అయినట్లే అంటూ మోక్ష ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఆనంద పడుతున్నారు బాలయ్య ఫాన్స్.

Also Read – జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ Vs మెగా ఫాన్స్ – ఎవరికి ఉపయోగం??