Telugu

నో డౌట్… జూనియర్ ఎన్టీఆర్ ఆన్ టార్గెట్..!

బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాపై ట్రేడ్ వర్గాల్లో బజ్ బాగా ఉంది. దీనికి ఒక కారణం సక్సెస్ లలో మునిగి తేలుతున్న జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కాగా, మరొకటి… ఈ సినిమాలో జూనియర్ ఓ డిఫరెంట్ లుక్ లో అద్భుతంగా కనిపించబోతున్నారన్న టాక్ తో ఈ సినిమాపై ఒక్కసారిగా క్రేజ్ ఏర్పడింది. దానికి అనుగుణంగానే ఇటీవల ఓ కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చి, సోషల్ మీడియాలో సందడి చేసాయి.

ADVERTISEMENT

ఇక, టైటిల్ విషయానికి వచ్చే సరికి, ముందుగా అందిన సమాచారం ప్రకారమే… “జై లవకుశ” అనే నామకరణంతో శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పండగ శుభాకాంక్షలు చెప్తూ యంగ్ విడుదల చేసిన మోషన్ పిక్చర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆలాగే ఈ మోషన్ పిక్చర్ ద్వారా తన ఫ్యాన్స్ కు మరో తీపికబురును కూడా అందజేశాడు జూనియర్.

ముందుగా చెప్పినట్లుగా ఈ సినిమాను ఎలాంటి ఆలస్యం చేయకుండా, ఈ ఏడాదిలోనే విడుదల చేయబోతున్నాడు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఈ సినిమా ప్రారంభం కావడానికి చాలా సమయం తీసుకోవడంతో అనుకున్న సమయానికి విడుదల అవుతుందో లేదో అన్న సందేహం సినీ జనాల్లో కూడా వ్యక్తమయ్యింది. అయితే అందులో మరో సందేహానికి ఆస్కారం లేకుండా… 2017 విడుదల అని చిత్ర యూనిట్ స్పష్టం చేయడంతో, ఈ ఏడాదిలోనే యంగ్ టైగర్ ‘ట్రిపుల్ యాక్షన్’ చూపించబోతున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Kamal Haasan, RKFI, SU Arun Promise a Huge Action Feast

Kamal Haasan is a renowned legend of Indian Cinema and he has been choosing young…

5 minutes ago

Toxic Has a New Version — And It’s Much Shorter

Yash’s Toxic is getting another version in theatres, and this one comes with a noticeably…

7 minutes ago