యుఎస్ వెళ్లినా అజ్ఞాతంలోనే జూనియర్

Jr Ntr keeping low profile at foreign Tripమాములుగా స్టార్ హీరోలు విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళను అక్కడుండే భారతీయులు మన సినిమాలు చూసే విదేశీయులు కలిసేందుకు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు ఉత్సాహం చూపించడం సహజం. ఒకవేళ సదరు తారలు చెప్పకపోయినా కనుక్కుని మరీ వెళ్తారు. అందులోనూ అమెరికా లాంటి దేశంలో చెప్పనక్కర్లేదు. లక్షల్లో ఉన్న తెలుగువారికి తమకిష్టమైన నటులు వస్తున్నారంటే కలిగే ఉద్వేగం చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ స్టార్ అయితే వేరే చెప్పాలా.

కొద్దిరోజుల క్రితం ఫ్యామిలీ ట్రిప్ కోసం యుఎస్ వెళ్ళిపోయిన తారక్ చాలా గుట్టును మైంటైన్ చేస్తున్నాడు. భార్యతో మొన్నామధ్య చిన్న ఫోటో షేర్ చేయడం తప్ప ఆపై ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. మహేష్ బాబు లాగా జూనియర్ తన పిల్లల పిక్స్ కానీ కుటుంబంతో గడిపిన క్షణాలను కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడు. ఇద్దరబ్బాయిలను సైతం సాధ్యమైనంత మేరకు మీడియా కెమెరాకు చిక్కకుండా చూసుకుంటున్నాడు. తానుగా చూపిస్తే తప్ప అంత ఈజీగా మాస్టర్ తారక్ లు దొరకడం లేదు.

ADVERTISEMENT

ఇలా లో ప్రొఫైల్ లో ఉండటం కూడా ఆశ్చర్యమే. ఒకపక్క ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేస్ లో ఒక్కోఅడుగు వేస్తోంది. షార్ట్ లిస్ట్ లో నాటు నాటు పాట ఉండటం చూసి అభిమానుల ఆనందం మాములుగా లేదు. నిజంగా జూనియర్ ఫలానా చోట ఉన్నాడని తెలిస్తే అమెరికాలో ఉన్న ఫ్యాన్స్ అందరూ వెళ్లి కాంగ్రాట్స్ చెప్పేవారు. కానీ ఆ ఛాన్స్ లేకుండా పోయింది. తారక్ బృందం కూడా ఎలాంటి లీకులు ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది. ఒకవేళ అక్కడేమైనా నిపుణుల సహాయంతో మేకోవర్ లాంటివి ప్లాన్ చేశాడేమో ఇక్కడికి వచ్చేదాకా తెలియదు.

కొరటాల శివతో మొదలుపెట్టాల్సిన సినిమాకు ఇప్పటికే విపరీతమైన జాప్యం జరిగిపోయింది. ఇంకో మూడు నెలల్లో ఆర్ఆర్ఆర్ ఫస్ట్ యానివర్సరీ వచ్చేస్తుంది. ఫిబ్రవరిలో షూట్ స్టార్ట్ అంటున్నారు. తారక్ రాగానే ఫైనల్ వెర్షన్ మరోసారి లాక్ చేసేసి షెడ్యూల్స్ కి వెళ్ళిపోతారు. ఈలోగా లొకేషన్స్ ఖరారు చేయడంతో పాటు హీరోయిన్ ఎవరో ఫిక్స్ చేసేయాలి. జాన్వీ కపూర్ అలియా భట్ ఇలా రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి కాబట్టి అఫీషియల్ గా చెప్పేదాకా ఏదీ తేలదు. వీటికోసమే జూనియర్ బ్రేక్ తీసుకుని ఉన్నా ఆశ్చర్యం లేదు.

ADVERTISEMENT
Latest Stories