మహేష్, పవన్, తారక్ లలో “యంగ్ టైగర్” నెం.1

jr ntr number fastest telugu heroటాలీవుడ్ లో నెంబర్ “1” స్థానం కోసం పోటీపడే హీరోలలో ప్రధానంగా వినిపించే పేర్లు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ‘బ్లాక్ బస్టర్’ అనే పదానికి దూరంగా ఉన్న జూనియర్, నెంబర్ గేమ్ నుండి తప్పుకున్నారు. అయితే, ఈ సమయంలోనూ “నాన్నకు ప్రేమతో” సినిమా చేస్తున్న బిజినెస్ ట్రేడ్ వర్గాలను అవాక్కు చేస్తోంది. ఈ సినిమాతో తారక్ మళ్ళీ నెంబర్ గేమ్ లో నిలబడడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు.

నిజానికి తారక్ నటించే ప్రతి సినిమా విడుదలకు ముందు జరిగే హంగామానే ఇది. కానీ, విడుదలైన తర్వాత నిట్టూర్పు, నిరుత్సాహం ప్రదర్శించడం అభిమానుల వంతవుతోంది. ఒకవేళ అందరూ అంచనా వేసినట్లు “నాన్నకు ప్రేమతో” సినిమా బ్లాక్ బస్టర్ స్థాయిని అందుకున్నప్పటికీ, టాలీవుడ్ లో నెంబర్ “1” పొజిషన్ ను డిక్లేర్ చేయలేని పరిస్థితి. గతంలో మహేష్ బాబు చెప్పినట్లు… ఇక నుండి తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ “1” ఎవరూ ఉండరని చెప్పే స్థితులు నెలకొన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విభాగంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నారు.

ADVERTISEMENT

‘పౌరాణికం’ (ఇప్పటివరకు ప్రయత్నించలేదు కూడా) మినహా ఎటువంటి కధలకైనా నూటికి నూరు శాతం న్యాయం చేయగల నటుడు ప్రిన్స్ మహేష్ బాబు. కెరీర్ మొదట నుండి సినిమా సినిమాకు వేరియేషన్ చూపించిన అతి కొద్ది మంది నటుల్లో ప్రిన్స్ ఒకరు. అలా అభినయం విషయంలో మహేష్ నెంబర్ “1”గా కొనసాగుతుంటే… టాలీవుడ్ లో ఎవరు ఎన్ని హిట్లు, ఎన్ని బ్లాక్ బస్టర్లు అందుకున్నా పవన్ కళ్యాణ్ క్రేజ్ ముందు సాటిరారు. అలా “క్రేజ్” విషయంలో పవన్ ను కొట్టే వారు లేరు. ‘తమ్ముడు, ఖుషి’ తరహా పాత్రలకు మాత్రమే అభినయం పరంగా పవన్ పూర్తి న్యాయం చేయగలడు.

ఇక, అభినయం పరంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను విమర్శించడానికి లేనప్పటికీ, మహేష్ చూపించిన విలక్షణతను జూనియర్ ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తున్నారు. అయితే పౌరాణికం విషయంలో మాత్రం ఒకడుకు ముందే ఉన్నాడు. డ్యాన్స్ ల విషయంలో పవన్, మహేష్ లకు అందనంత దూరంలో వున్న తారక్, హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలను చేసుకుపోవడంలో కూడా ‘యంగ్ టైగర్’ నెంబర్ “1.”
పవన్ (1996), మహేష్ (1999) ల కంటే లేటుగా (2001లో) కెరీర్ ప్రారంభించినా కూడా, అప్పుడే 25 సినిమాలు పూర్తి చేసుకుని పవన్, మహేష్ లకు అందకుండా ‘యంగ్ టైగర్’ సాగిపోతున్నాడు. ఇప్పటివరకు 21 సినిమాలు పూర్తి చేసిన మహేష్, 25వ సినిమాకు చేరుకునే సమయానికి బహుశా తారక్, 30ల్లోకి అడుగు పెట్టవచ్చు. ఇక, పవన్ అయితే అసలు 25వ సినిమా చేస్తాడో లేదో కూడా ప్రశ్నార్ధకంగా మిగిలింది.

ఎక్కువ సినిమాలు చేయడమనేది తెలుగు సినీ పరిశ్రమ పరంగా చాలా ముఖ్యం. దీని వలన అనేక మంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలు చేసింది అదే. అందుకనే అప్పట్లో తెలుగు సినిమా ఒక వెలుగు వెలిగి స్వర్ణమయమైంది. ప్రస్తుత హీరోలు అది చేయకపోవడంతో తమిళ ఇండస్ట్రీతో పోలిస్తే తెలుగు సినిమా వైభవం కాస్త మసక బారింది. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ మిగతా హీరోలకు ఆదర్శప్రాయుడే. ఇలాగే మరిన్ని సినిమాలు చేస్తూ తెలుగు పరిశ్రమ ఖ్యాతిని పెంపొందించాలని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories