సంచలనం సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ తాజా లీకు

r NTR RRR movie leak (2)ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాలలో జరుగుతుంది. సినిమాలో కొమరం భీంగా నటిస్తున్న ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే లొకేషన్ నుండి వస్తున్న లీకులు చిత్రబృందాన్ని కలవరపెడుతుంది.

తాజాగా అడవిలో ఎన్టీఆర్ కేవలం ఒక డ్రాయర్ తో ఉన్న కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. ఈ విజువల్స్ కలకలం రేపుతున్నాయి. అయితే రాజమౌళి కాబట్టి నందమూరి అభిమానులు ఎటువంటి తేడా జరగదని నమ్మకంతో ఉన్నారు. అయితే ఇటువంటి కీలకమైన సన్నివేశాలు లీక్ కావడం ఇబ్బందే.

ADVERTISEMENT

మరోవైపు ఆర్ఆర్ఆర్ అక్టోబర్ కు వాయిదా పడినట్టు సమాచారం. తాజాగా దసరా సందర్భంగా సినిమా విడుదల అవుతుందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

వారి వారి పోరాటాలకు ముందు వారు ఢిల్లీలో కలిసినప్పుడు ఏం జరిగి ఉంటుంది అనే ఊహాజనిత స్టోరీ… ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన ఒక హాలీవుడ్ తార కనిపించబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు భారీగా ఆఫర్స్ వస్తున్నాయి. ఒక్క ఆంధ్ర సైడ్ నుండే 100 కోట్ల బిజినెస్ చేస్తుందని అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories